నందమూరి వంశం మూడో నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాస రావుల కుమార్తె లక్ష్మీప్రణితల వివాహ లగ్న పత్రిక వేడుక ఆదివారం ఫిల్మ్‌నగర్‌లో ఘనంగా జరిగింది. వధువు తండ్రి నార్నె నివాసంలో ఉదయం 8.05 గంటలకు జరిగిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో వరుడు తండ్రి నందమూరి హరికృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అంతకుముందు హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ వివాహానికి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, మహిళలు, అభిమానలు, కార్యకర్తలు, ఇలా హితులు, సన్నిహితులు అందరినీ ఆహ్వానిస్తామన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని హరికృష్ణ తెలిపారు.
No comments:
Post a Comment