Friday, February 4, 2011

సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆ ఆలోచన లేదు: శ్రీదేవి

ప్రస్తుతానికి తనకు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని చెబుతోంది అతిలోకసుందరి శ్రీదేవి. తెలుగు,తమిళ, హిందీభాషల్లో తిరుగులేని హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ మధ్య రీఎంట్రీకి ప్రయత్నించినా ఆ దిశగా సక్సెస్ కాలేకపోయింది. ఈ మధ్య తరచూ ఫంక్షన్లలో కన్పిస్తున్న ఈమెను మళ్లీ తెరపై ఎప్పుడు కన్పిస్తారని అడిగితే ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నానని సమధానమిచ్చింది.

నటన విషయంలో ఆమెకు ఇంత వైరాగ్యం ఎందుకు వచ్చిందో ఏమోగానీ గ్లామర్ పెంచే విషయంలో మాత్రం బిజీగా ఉందట. తెర వెనుక రీఎంట్రీకి సన్నాహాలు చేసుకుంటూనే ఈ విధంగా ఎందుకు చెప్పుకుంటుందో ఆమెకే తెలియాలి.

No comments:

Post a Comment