
''తెరపై అందంగా కనిపించడం ఎలాగో తెలుసు. అందుకోసమని అరకొర దుస్తులతో కనిపించాల్సిన అవసరం లేదు. టాప్స్-జీన్స్‌లో కనిపించేది ఓ రకం అందం. చీరకట్టులో మెరిస్తే మరో రకమైన అందం. అంతే తప్ప అంగాంగ ప్రదర్శనతోనే గ్లామర్‌గా కనిపిస్తామన్న మాటను నేను నమ్మను. నేను మాత్రం నా శైలిలోనే కనిపిస్తా'' అని చెబుతోంది స్నేహా వుల్లాల్. ఇటీవలే విడుదలైన అలా మొదలైందిలో స్నేహ నటించింది. సింహా లాంటి విజయం తరవాత చిన్న పాత్రలో చేశారేమిటి? అని ప్రశ్నిస్తే ''బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలు సైతం ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. అవకాశాల్లేక అలాంటి పాత్రలను ఎంచుకొన్నారని అనుకోలేం కదా. పాత్రల విషయంలో చిన్న, పెద్ద తేడాలను ఇక్కడే గమనిస్తున్నా. ప్రేక్షకులకు కావల్సింది మన పాత్ర నిడివి ఎంత అన్నది కాదు.తక్కువ కనిపించాలి ఎక్కువ ప్రభావాన్ని చూపాలనేది నేను నమ్మిన సిద్ధాంతం'' అని సమాధానమిచ్చింది. దక్షిణాదిలో వంటకాలంటే చాలా ఇష్టమని చెబుతున్న స్నేహ - ''వడ అనే మాట వినిపిస్తే చాలు నోరూరుతుంది.అల్పాహారంలో వడ ఉంటే మరేదీ తీసుకోను. ఆంధ్ర, తమిళనాడుల్లో వంటలు భలే రుచిగా ఉంటాయి'' అంటోంది.
No comments:
Post a Comment