Thursday, February 3, 2011

సల్మాన్ ఎక్కడుంటే అమీషా అక్కడే.. ఎందుకంటారూ...?



బాలీవుడ్ ముదురు హీరో సల్మాన్ ఖాన్ తోకవెంటే తిరుగుతోందట అమీషా పటేల్. పోయిన సంవత్సరం డిసెంబరు నెలలో సల్లూ పుట్టిన రోజు వేడుక నాటి నుంచి వీళ్లద్దరిమధ్య స్నేహం ముదిరి పాకాన పడిందట. దుబయ్‌లో సల్మాన్ బర్త్ డే ఫంక్షన్‌కు అమీషా ప్రత్యేకంగా వెళ్లి అతడితో డిన్నర్ చేయడమే కాక రాత్రంతా తెగ ఉత్సాహపరిచిందట. అమీషా ఇచ్చిన ఉత్సాహాన్ని సల్లూ మర్చిపోలేకపోతున్నాడట. తన సన్నిహితుల వద్ద ఆనాటి పార్టీ గురించి ఒకటే చెపుతున్నాడట.

మరోవైపు అమీషా పటేల్ సైతం ఇంట్లో నిలకడగా ఒకచోట కూచోలేకపోతోందట. సల్మాన్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడ వాలిపోతున్నదట. ఒకవేళ అదీ కుదరకపోతే నేరుగా అతని ఇంటికే వెళ్లి గంటలతరబడి "హస్క్" కొడుతోందట.

అలా పొద్దుపోయే వరకూ ఒకరికొకరు కబుర్లుకాకరకాయలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారట. మొత్తానికి ముదురు హీరోకి ముదురు హీరోయిన్ వేవ్ లెంగ్త్ సరిపోయినట్టు లేదూ....!!

No comments:

Post a Comment