
ఐటం గాళ్స్‌కు అడ్రస్ లేకుం డా చేస్తున్నారుఒకప్పుడు ప్రతి చిత్రసీమలోనూ ఐటం సాంగ్స్ చేసేందుకు ప్రత్యేకంగా డ్యాన్సర్లు ఉండేవాళ్లు. వీళ్లను ఐటం సాంగ్స్ స్పెషలిస్టులనేవారు. మన తెలుగు చిత్రసీమలో జయలలిత, జ్యోతిలక్ష్మి, అనురాధ, సిల్క్‌స్మితలు ఆ కోవలోనివారే. బాలీవుడ్ విషయానికొస్తే హెలెన్, జీనత్ అమన్ మొదలుకుని ఇప్పటి మల్లికాశరావత్, మలైకా అరోరాఖాన్ వంటివారు ఐటం బాంబులనిపించుకునేవాళ్లు. అయితే, ఇప్పటి హీరోయిన్స్.. ఐటం గాళ్స్‌కు అడ్రస్ లేకుండా చేసేస్తున్నారు. సెక్స్ బాంబులుగా పేరుపడ్డవాళ్లతో చేయించుకోవాల్సిన స్పెషల్ సాంగ్స్‌ను తామే చేసేస్తున్నారు. తెలుగులో ‘రావోయి చందమామ’లో ఐటం సాంగ్ చేసిన ఐశ్వర్యరాయ్ హిందీలో ‘బంటి ఔర్ బబ్లి’లోనూ ఆ పని చేసింది. ‘కేడి’లో అనుష్క, ‘కొమరం పులి’లో శ్రీయ, ‘రగడ’లో చార్మి ఐటం సాంగ్స్ చేయడం తెలిసిందే. అంతేకాదు, తాము హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రంలోనే ఐటం సాంగ్స్ చేసేస్తూ.. ఐటం గాళ్స్‌కు ఇవ్వాల్సిన పారితోషికాన్ని కూడా తామే తీసేసుకుంటున్నారు. ‘తీస్‌మార్ ఖాన్’ చిత్రంలో కత్రినాకైఫ్, షారుక్‌ఖాన్ నటిస్తూ నిర్మిస్తుండగా, త్వరలో విడుదల కానున్న ‘రా-వన్’ చిత్రంలో కరీనా చేసిన ఐటం సాంగ్‌ను ఈ కోవలో చేర్చవచ్చు. అందువల్లే.. అభినయశ్రీ, ముమైత్‌ఖాన్‌ల తర్వా త మన తెలుగులో ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకునే అవకాశం ఏ భామకూ దొరకడం లేదు!
No comments:
Post a Comment