
భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా..?
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తన భార్య స్రవంతి ఎంతో మంచిదనీ, అయితే అత్త జమున వల్ల ఆమె మారిపోయిందన్నాడు. జమునకు గర్వం ఎక్కువనీ, తనను చాలా హీనాతిహీనంగా చూసేదని ఆరోపించాడు. స్రవంతికి ఆస్తులున్నాయని తను ప్రేమించలేదనీ, మనస్పర్థలు వచ్చిన తర్వాత జమున తమ ఇద్దరి మధ్యకు వచ్చి కుటుంబాన్ని కొల్లేరు చేసిందన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయా...? అలా వచ్చినా ప్రతి జంట ఎవరికివారు సర్దుకు పోతుండబట్టే కుటుంబాలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చాడు. తమలా బజారుకెక్కితే పోలీసులకు, లాయర్లుకు తీరికే ఉండదన్నాడు. అతడు మేకవన్నె పులి.. చెప్పేవన్నీ అబద్ధాలే...
మరోవైపు జమున కుమార్తె స్రవంతి తన భర్త చెప్పిన మాటలను కొట్టిపారేసింది. అతడు చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పింది. ప్రేమవివాహం చేసుకున్న కొద్ది రోజులకే తమకు ఆస్తి కావాలంటూ తనను రాహుల్ వేధించాడని ఆరోపించింది. తన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి కూడా ఎత్తులు వేశారని కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రేమను దీవించినందుకు ఫలితమిదా...?
నటి జమున మాట్లాడుతూ... ఏ తల్లీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకోదనీ, తన కుమార్తెను ప్రేమించానని చెపితే అడ్డగించకుండా, వేరే కులమైనప్పటికీ దీవించి అక్షింతలు వేశామని అన్నారు. బహుశాః అదే తాము చేసిన తప్పు అయివుండవచ్చన్నారు. పెళ్లైన దగ్గర్నుంచి అతడిని అల్లుడిగా కాక కుమారుడిలా చూసుకున్నానన్నారు. కానీ వారు మాత్రం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
No comments:
Post a Comment