నయనతార పేరు వినగానే... ప్రభుదేవా గుర్తుకువస్తాడు. వీరిద్దరి పరిచయం ఎలా అయిందో ఏమోకానీ... పెండ్లి వరకు దారితీసింది. మొదటి భార్యకు విడాకులిచ్చి నయనతార చెంతకు చేరడానికి సిద్ధమైన ప్రభుదేవాతో తమిళ ఇండస్ట్రీ పెద్దలు కూడా చర్చలు జరిపారు. మొదటి భార్య ససేమిరా అనడంతో ప్రభుదేవా.. వినలేదు. ఈ నేపథ్యంలో ఎవరి పనుల్లో వారు ఉన్నారు. షూటింగ్‌ల్లోనూ బిజీగా ఉన్నారు. కానీ... తను చేస్తున్న పాత్ర.. పరమపవిత్రమైన సీత పాత్ర కనుక దానికి ఈమె అనర్హురాలని ఆమధ్య గొడవ జరిగింది. కానీ.. దర్శకుడు బాపు, నిర్మాత సాయిలు మాత్రం.. నటనకు నిజజీవితానికి లింకు పెట్టకూడదని చెప్పారు. ప్రస్తుతం ఆమె 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ శివార్లలో కుటీరాల్లాంటి సెట్స్‌కూడా వేశారు. అక్కడ ఆమెను పలుకరిస్తే... ముక్తసరిగా సమాధానాలు చెప్పింది. అవి మీ కోసం...
మీ ప్రేమ వివాహం ఎంతవరకు వచ్చింది? ఏవో గొడవలున్నాయని వార్తలు వస్తున్నాయి..?
అవన్నీ రూమర్సే. మా మధ్య గొడవలు లేవు. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. గాలి వార్తల గురించి పట్టించుకోను.
సీత పాత్ర వేయడంపై కూడా గొడవ జరిగిందిగదా. మీ దృష్టికి వచ్చిందా?
విన్నాను. ఆ వార్తలు కూడా చెవిన పడ్డాయి.. నటనవేరు, వ్యక్తిగతం వేరు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలచుకోలేదు.
సీత పాత్ర ఎలా అనిపిస్తుంది?
బాపుగారి దర్శకత్వంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. బాలకృష్ణగారితో 'సింహా' తర్వాత మరో చక్కటి సినిమాలో నటిస్తున్నందుకు మరింత ఆనందంగా ఉంది. మరోపక్క పద్మ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుతో నటించడం చెప్పలేని అనుభూతి కల్గిస్తుంది. అభిరుచిగల నిర్మాత సాయిబాబా. లవకుశల చరిత్ర తెలుసు. రామాయణంలో సీత పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర రావడం దైవనిర్ణయంగా ఫీలవుతున్నాను.
పెళ్లయ్యాక నటీమణులు సినిమాలు చేయరు. మరి మీరేం చేస్తారు..?
కరెక్టే... పెళ్ళయ్యాక నటించకూడదని చెప్పింది ప్రభునే. నేను కూడా ఆలోచించి.. తను చెప్పింది కూడా కరెక్టేగా అనిపించింది. అందుకే పెళ్లయ్యాక నటించకూడదు అనే నిర్ణయానికి వచ్చాను. బహూశా.. శ్రీరామరాజ్యం తర్వాత నటించను. ఇదే ఆఖరు సినిమా అవుతుంది.
పెళ్లెప్పుడు చేసుకుంటారు?
శ్రీరామరాజ్యం షూటింగ్ పూర్తయ్యాక పెండ్లిచేసుకుంటా..
అడ్డంకులు తొలగిపోయాయా?
మా పెళ్లికి అడ్డంకులు ఏమీలేవు. రకరకాల మీడియాలో వస్తున్న కథనాలు అన్ని ఒట్టి బూటకాలే.
మలయాళంలో బాడీగార్డ్ చేశారు. దాన్ని తెలుగులో చేస్తే మీరే నటిస్తారా?
చేయను. (నవ్వుతూ) మీరే అన్ని కమిట్ చేస్తున్నారు.. అక్కడ ఘనవిజయం సాధించింది. తమిళంలో కూడా విజయ్ కాంబినేషన్‌లో అడిగారు. చేయనని చెప్పాను.
పెళ్లి తర్వాత మీ వ్యాపకాలు ఏమిటి? నిర్మాతగా మారతారా?
ఓన్లీ గృహిణిగానే ఉంటాను. నిర్మాతగా మారాలంటే చాలా కష్టం. మెంటల్ టెన్షన్.. దాన్ని నేను భరించలేను. మంచి భార్యగా ఉండాలనేది నా కోరిక. అంటూ ముగించారు.

No comments:
Post a Comment