
విజయ్-నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘యమకంత్రి’. ఇండియన్ మైకేల్‌జాక్సన్ ప్రభుదేవా దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.ప్రకాష్‌రాజ్ విలన్ పాత్రలో నటించారు. జిడిఆర్ మీడియా సమర్పణలో జె.పి.ఫిలింస్ పతాకంపై నిర్మాత జి.ఉషారాణి ఇక్కడ అందిస్తున్నారు. కోయల్ ఆడియో సంస్థ ఈ సినిమా గీతాల్ని మార్కెట్లోకి తెచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో చిత్రాంజలి పత్రికాధినేత, ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత జె.పి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి, సాహితి, బి.ఎ.రాజు, సురేష్‌రెడ్డి, ధని ఏలె, సురేష్ కొండేటి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ఆడియో తొలిసిడిని తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి ఎస్వీ కృష్ణారెడ్డికి అందించారు. ప్రచార చిత్రాల సిడిని బి.ఎ.రాజు ఆవిష్కరించి మధురాశ్రీధర్‌కు అందించారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘పత్రిక ఎడిటర్ స్థాయినుంచి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి జె.పి. ఓ మంచి సినిమాతో ముందుకొస్తున్నాడు.దేవిశ్రీ పాటలు బావున్నాయి. విజయం దక్కి, జె.పి స్ట్రెయిట్ సినిమాలు నిర్మించాలి’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘అంకితభావంతో పనిచేసే వ్యక్తి జె.పి. తమిళంలో భారీ విజయం దక్కించుకున్న సినిమాతో నిర్మాతగా వస్తున్నారు. 
పెన్‌డ్రైవ్‌లో పాటలు!
టాలీవుడ్‌కి తొలిసారిగా ఓ కొత్త విధానాన్ని పరిచయం చేయడం ‘యమకంత్రి’ ఆడియోలో ప్రత్యేక విశేషం.ఇప్పటివరకూ సిడిలు, డివిడిలు, డౌన్‌లోడింగులే తెలిసిన శ్రోతలకు సరికొత్తగా పెన్‌డ్రైవ్ ద్వారా పాటలు వినే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. దీనికి ‘పిడి’ సాంగ్స్ అని పేరు పెట్టారు.‘యమకంత్రి’ పిడి పాటలను కె.అచ్చిరెడ్డి ఆవిష్కరించి ఎస్వీ కృష్ణారెడ్డికి అందించారు.
No comments:
Post a Comment