Wednesday, February 2, 2011

కోడి పై పుంజు గెలుస్తుందా



కోడి పందెంలోనైనా ఏ పుంజు గెలుస్తుందో చెప్పగలం. ప్రేమ పందెంలో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే అది మనసుల మధ్య పోరు కాబట్టి. ఓ అందమైన యువకుడు. అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. అతగాణ్ని ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రేమిస్తారు. ఇంతకీ అతగాడి మనసు ఎవరు గెలుచుకున్నారో ఆసక్తికరం అంటున్నారు వి.ఎన్‌.ఆదిత్య. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'రాజ్‌'. సుమంత్‌ కథానాయకుడు. ప్రియమణి, విమలారామన్‌ కథానాయికలు. కుమార్‌ బ్రదర్స్‌, గౌటి హరనాథ్‌ నిర్మాతలు. రీ రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''సుమంత్‌ ఇందులో ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు. నవతరానికి ప్రతినిధిలాంటి పాత్ర అది. ప్రేమ, పెళ్లి విషయంలో యువత మనోభావాలు ఎలా ఉండాలో మా చిత్రంలో చూపిస్తున్నాం. ఇంతకీ రాజ్‌ మనసు గెలుచుకున్న రాణి ఎవరో తెరపైనే చూడాలి. ఇటీవలే విడుదల చేసిన పాటలకు స్పందన బాగుంది. ఈ నెల్లోనే విడుదల చేస్తామ''న్నారు. సంగీతం: కోటి.

No comments:

Post a Comment