
హాటెస్ట్ గాళ్ నీతూ చంద్రా చిటపటలాడింది. తను నివాసముంటున్న భవనం కింద నుంచి చెవులు చిల్లులుపడేటంత సౌండ్ విని చిర్రెత్తిపోయింది. అసలు సంగతి ఏంటయా... అంటే... నీతూ చంద్ర నివాసముంటున్న ఫ్లాటు కిందిభాగంలో ఓ సిమెంటు రోడ్డు ఉంది. ఆ రోడ్డుపై కొంతమంది కుర్రాళ్లు మోటార్ బైకు రేసు పోటీలు పెట్టుకున్నారట.
కుర్రాళ్లు.. పైగా మోటార్ సైకిల్ పోటీలు... అంతే, బైకులు రయ్.. జుయ్.. కుయ్...మంటూ ఒకటే రణగొణ ధ్వనులు. చెవులు చిల్లులు పడే మోత. దీంతో నీతూచంద్ర బిలబిలమంటూ పైఅంతస్తు నుంచి కిందికి పరుగెట్టుకుంటూ వచ్చిందట. మోటార్ సైకిళ్లు నడుపుతున్న కుర్రాళ్లపై చడామడా అరిచి నానా యాగీ చేసిందట.
అంతటితో ఊరుకోకుండా... ఓ కుర్రాడి హెల్మెట్ తీసుకుని, అతడిని బైకుపై నుంచి దిగమని దానిపై తనెక్కిందట. మిగిలినవారిని తనతో రేసులో గెలవమని సవాల్ విసిరి, రయ్‌మంటూ మెయిన్ రోడ్డువైపు దూసుకెళ్లిందట. నీతూ సవాల్‌ను స్వీకరించిన కుర్రాళ్లు ఆమె వెనుకే అనుసరించారట. అయితే ఆమె స్పీడును అందుకోలేకపోయారట.
నీతూ మాత్రం సదరు మోటార్ సైకిల్‌ను యమస్పీడుతో నడిపి తుక్కుతుక్కు చేసి పారేసిందట. ఆ తుక్కు మోటార్ బైక్‌ను చూసిన కుర్రాళ్లు... గుడ్ల మిటకరించి వెనక్కి తిరిగి చూడకుండా వారివారి బైకులేసుకుని అక్కడ్నుంచి తుర్రుమన్నారట.
No comments:
Post a Comment