నాగచైతన్య-తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గీతా ఆర్ట్‌స చిత్రానికి ‘100 పర్సంట్ లవ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి అల్లూ అరవింద్ సమర్పకుడు. బన్ని వాసు నిర్మాత. అల్లూ అరవింద్ మాట్లాడుతూ ‘మా సంస్థ నుంచి జల్సా, గజిని, మగధీర -చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమా అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. సుకుమర్ చెప్పిన కథ విని గంటలోనే ఓకే చేశాను. స్క్రిప్టుపై 100 పర్సంట్ పట్టు ఉన్న దర్శకుడాయన. తన గత చిత్రాలకంటే 100 పర్సంట్ లవ్‌ని ఈ చిత్రంలో తెరకెక్కించాడు. దేవీశ్రీప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా ఆడియో చాలావరకూ చార్ట్‌బస్టర్‌లో నంబర్‌వన్‌గా నిలిచాయి. ఈ సినిమా ఆడియో కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మార్చి 3వ వారంలో ఆడియో, ఏప్రిల్ 3వవారంలో సినిమా విడుదల చేస్తాం.చక్కని ప్రేమకథకు సరిజోడు కుదిరితే తెరపండుగే. వేసవిలో కూల్ లవ్‌స్టోరీ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎడిద రాజా, కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.
No comments:
Post a Comment