రాష్ట్ర శాసనసభలో ఉన్న జగన్ వర్గానికి చెందిన సభ్యులు ప్రజాప్రతినిధులు కారని వీధి రౌడీలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆరోపించారు. ఇలాంటి వారిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్ అవినీతి అక్రమాలపై ఎల్జీపీ వేయాలని కోరుతూ తెదేపా సభ్యులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. వైఎస్ దొంగల ముఠా అంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఆగ్రహించిన మంత్రి వైఎస్.వివేకా తెదేపా సభ్యులను అడ్డుకునేందుకు వెళ్లారు. ఇదేసమయంలో వివేకాకు మద్దతుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు వచ్చి తెదేపా సభ్యులపై దాడులకు పాల్పడినట్టు సమాచారం.
దీనిపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన తానెన్నడూ చూడలేదన్నారు. సాక్షాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, జగన్ వర్గానికి చెందిన సభ్యులు తెదేపా సభ్యులపై దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. అందువల్ల వీరిని వీధి రౌడీలతో పోల్చుతున్నట్టు చెప్పారు.
సభలో దూకుడుగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తానే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే.. ఈ పాటికి సభా మర్యాదలను అప్రతిష్టపాలుజేసిన మంత్రి బర్తరఫ్ చేసి ఉండేవాడినన్నారు.

No comments:
Post a Comment