Wednesday, March 23, 2011

ఐష్‌ను పొగుడుతున్న హాలీవుడ్ నటుడు: ఉడుక్కుంటున్న అభి

"ఓహ్... ఏం అందం... ఇంతటి అందగత్తెను నేనెక్కడా చూళ్లేదు. నిజంగా నిజం..." ఈ మాటలను అన్నది హాలీవుడ్ అగ్రనటుడు మాథ్యూ కనాగే. ఇతగాడు ఇప్పటికే ఇద్దరు పిల్లలు తండ్రనుకోండి. అయినా ఐష్ అందాన్ని చూసిన తర్వాత ఆగలేకపోయాడట. పొగడకుండా ఉండలేకపోయాడట.ఇండియాకు చెందిన ఓ మహిళ ఇంత అద్భుత అందాలరాశిగా ఉండటాన్ని ఇంతవరకూ చూళ్లేదనీ, ఆ మాటకొస్తే అలాంటి మహిళే ఈ భూప్రపంచంలో తనకింతవరకూ తారసపడలేదని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడట. ఈ పొగడ్తలు ఐష్‌కు కమ్మగానే ఉండిఉంటాయి. కానీ అభిషేక్‌కు మాత్రం కారం పూసినట్లున్నాయట.

హాలీవుడ్ పేరెత్తితేనే చాలు "ఖయ్"మని ఎగిరి మీదపడుతున్నాడట. అన్నట్లు ఇటీవల అభిషేక్ బచ్చన్‌ను బాలీవుడ్ లెక్కచేయడం లేదు. ఐష్‌కిస్తున్నంత ప్రాముఖ్యం అభికి ఇవ్వడం లేదు. మరి బాలీవుడ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే హాలీవుడ్ సంగతి వేరే చెప్పాలా...? కూరలో కరివేపాకే...

No comments:

Post a Comment