నిత్యానంద, రంజితల రాసలీలలకు సంబంధించిన క్లిప్పింగులు బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నిత్యానందపై రోజుకో నిజం బయటకు వచ్చాయి. దాంతో పోలీసులు నిత్యానందను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఇదిలావుండగా నిత్యానంద చరిత్రపై ఆయా ఫిలిం ఇండస్ట్రీలు దృష్టి సారించాయి. సినిమాగా తీసేందుకు పలువురు నిర్మాతలు రంగంలోకి దిగారు.
తెలుగులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నిత్యానంద బ్యాక్‌డ్రాప్‌తో అయ్యారే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ చిత్రంపై ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయడంతో సినిమాపై సస్పెన్స్ సాగుతోంది.
ఇదిలావుండగా కన్నడ సినీపరిశ్రమలో సత్యానంద పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం కూడా నిత్యానంద జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిత్రీకరించినట్లు ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయడంతో అది కూడా బాక్సీఫీసు వద్ద వెయిట్ చేస్తోంది. నిత్యానందా... మజాకా...
No comments:
Post a Comment