Sunday, April 3, 2011

నీ నగ్న రూపాన్ని జంతువులకు చూపించు... మనుషులక్కాదు

టీమిండియా ప్రపంచకప్ కైవసం చేసుకుంటే తన నగ్న రూపాన్ని చూపిస్తానంటూ గత రెండు వారాలుగా గోల చేస్తున్న హాట్ మోడల్ పూనం పాండేకు పెటా( పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఓ సూచన చేసింది. తన నగ్న రూపాన్ని మైదానంలో క్రికెట్ అభిమానులకో లేదంటే క్రికెట్ ఆటగాళ్లో కాకుండా జంతువుల కొరకు చూపించాలని కోరింది. జంతువులను హింసకు గురి చేస్తున్నవారికి కనువిప్పు కలిగించేందుకు దుస్తులు విప్పేసి నగ్న ప్రదర్శన ఇవ్వాలని కోరింది.

గతంలో జంతువులకోసం పమేలా ఆండర్సన్ నగ్న ప్రదర్శనలు ఇచ్చిందనీ, ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రదర్శించాలని పేర్కొంది.

జంతువుల చర్మం కోసం వేటగాళ్లు వాటిని బలి తీసుకుంటున్నారనీ, అటువంటివారికి కనువిప్పు కలిగించేందుకు పూనం పాండే నగ్నంగా ప్రదర్శనలివ్వాలంది. మరి జంతువులకోసం పూనం దుస్తులిప్పేసి నిలబడుతుందా..?

No comments:

Post a Comment