జోష్’ సినిమాతో నాగచైతన్యతో కలిసి తెరంగేట్రం చేసిన ఒకప్పటి బ్యూటీక్వీన్ రాధ ముద్దుల తనయ కార్తిక ఆ ఒక్క సినిమాతోనే సరిపుచ్చుకోవాల్సివచ్చింది. కార్తిక పూర్తి పేరు కార్తిక నాయర్. ముంబయ్‌లో స్కూల్ స్టడీస్ పూర్తిచేసిన కార్తిక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో డిగ్రీ చదువుతోంది.
తల్లి వారసత్వం పుణికిపుచ్చుకున్న కార్తికను తొలిచిత్రంతోనే సంచలన హీరోయిన్‌గా చేద్దామనుకంది రాధ. కానీ ‘జోష్’ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో కార్తిక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో ‘కో’ చిత్రంలో నటిస్తోంది. జీవ, ప్రకాష్‌రాజ్‌లు ఇతరపాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కో’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఆ చిత్రానికి ‘రంగం’ అనే పేరు ఖరారుచేశారు. ఇప్పుడు ఈ ‘రంగం’ సినిమాతో కార్తిక తిరిగి తెలుగు స్ట్రైట్ చిత్రాలలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. 
No comments:
Post a Comment