Saturday, April 16, 2011

బాలీవుడ్‌ను ఆకర్షించే అందాలున్నాయ్: తాప్సీ

WD
"ఝుమ్మంది నాదం" చిత్రంతో తెలుగు టీనేజ్ ప్రేక్షకుల హృదయాలను జివ్వున లాగేసిన తాప్సీ దక్షిణాది సినిమాలను ఆపేసి ఉత్తరాది వైపు చూస్తోంది. దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీలకి ఆమె కాల్షీట్లు దొరకడం లేదట. సంగతేంటని ఆరా తీస్తే... బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో పీకల్లోతు చర్చల్లో మునిగిపోయి ఉన్నదట. కోలీవుడ్ నిర్మాతలు కదిలిస్తే... మళ్లీ ఫోన్ చేస్తానంటూ తనదైన శైలిలో గారాలు పోతోందట.

మరోవైపు తాప్సీ తాజాగా బాలీవుడ్ కోసమే స్పెషల్ ఫోటో షూట్ చేయించి పంపిందట. వాటిని చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫ్లాటైపోయారట. ఆమె కాల్షీట్లకోసం సంప్రదిస్తున్నారట. అంతేకాదు... తాప్సీ బాలీవుడ్‌లో ఎంటరైతే ఇప్పటికే ఉన్న సెక్సిణులు ఫేడైపోతారనీ, తాప్సీ అందాలు సూపర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట.

శ్రియను కూడా మొదట్లో అలాగే పొగిడారు. ఆ తర్వాత ఆమెను పట్టించుకున్నవారే లేరు. చివరికి టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌లు చేస్తోందన్న సంగతి తాప్సీకి తెలుసో.. లేదో మరి.

No comments:

Post a Comment