Wednesday, April 27, 2011

ఆమెను పంపించండి బాబోయ్: రంజితపై ఫిర్యాదు

ఒకప్పుడు ఆమెను అందరూ సినిమా హీరోయిన్‌ అని మెచ్చుకునేవారు. ఇప్పుడు వారే ఆమె ఉంటే తాము అక్కడ ఉండలేమని ఫిర్యాదు చేస్తున్నారు. నిత్యానందతో సెక్స్‌ స్కామ్‌లో ఇరుక్కున్న నటి రంజిత పబ్లిక్‌లో రావడం మానేసింది. కానీ ఇంటి దగ్గర కూడా ఉండలేకపోతోంది. చెన్నైలో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఆమెను బయటికి పంపే ఏర్పాటు చేయాలని అక్కడి అసోసియేషన్‌కు అపార్ట్‌మెంట్లలో నివశిస్తున్నవారు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన రంజిత చెన్నై ఫ్లాట్‌ అమ్మకానికి పెట్టింది.

అయితే ఆమె పరిస్థితి అమ్మబోతే అడవిలా మారిపోయిందట. ప్రస్తుతం ఉన్న ధరకంటే.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారట. దీంతో ప్రజలకు మానవత్వమే లేదని వాపోతుందట రంజిత. చేసేది లేక వచ్చినంత తీసుకుని బెంగళూరులో సెటిల్‌ అవ్వాలనుకుని నిర్ణయించుకున్నదట.

ఇటీవల కన్నడలో ఆమె 'శివకాశి' చిత్రంలో ఐటంసాంగ్‌ చేసింది. ఈ చిత్రంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి ఓ ప్రధాన పాత్రలో నటించారట.

No comments:

Post a Comment