Saturday, April 30, 2011

సూసైడ్‌పై టార్గెట్: "నేనూ - నా రాక్షసి"

నటీనటులు: రానా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, కోటశ్రీనివాసరావు, ముమైత్‌ఖాన్‌ తదితరులు. కెమెరా: అమోల్‌ రాథోడ్‌, సంగీతం: విశ్వ రెహమాన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), రచన, దర్శకత్వం: పూరీజగన్నాథ్‌. సమర్పణ: బేబీ భవ్య. 
పాయింట్‌: ఆత్మహత్యలు చేసుకొనేవారు ఎంతటి క్షోభను అనుభవిస్తారనేది తెలియజెప్పే పాయింట్‌."ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం" చిత్రం చూసినవారికి ఆ సినిమా గుర్తుండే ఉంటుంది. యువతీ,యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకోకుండా రావడంతో వారిలో ప్రేమ చిగురిస్తుంది. చివరికి బతకాలని ఒకరికోసం ఒకరవుతారు. గీతాంజలిలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు చనిపోదామనుకుని చివరిలో బతకాలనే ఆశతో ఉంటారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే కథల్లోంచి పుట్టిన కొత్త కాన్సెప్ట్‌ "నేను నా రాక్షసి"

కథలోకి వెళితే.... ఇలియానా మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడే ఘటనతో కథ ఆరంభమవుతంది. ఆ తర్వాత ఈమె గురించి ఫ్లాష్‌బ్యాక్‌ వస్తుందేమోనని ప్రేక్షకుడు అనుకుంటాడు. అయితే అలాక్కాదు. ఇందులో ఇలియానా ద్విపాత్రాభినయం అని తర్వాత తెలుస్తుంది. అభిరామ్‌ (రానా) కిరాయి గన్‌తో హత్యలు చేస్తుంటాడు. దీనిద్వారా వచ్చిన డబ్బును కోమాలో ఉన్న తన తల్లిని కాపాడేందుకు ఉపయోగిస్తాడు.

మరోవైపు మీనాక్షి (ఇలియానా) ఓ కాఫీబార్‌లో ఉద్యోగం చేస్తుంది. అభి, మీనాక్షి ఒకరికొకరు పలుసార్లు తారసపడతారు. ఈమెను చూడగానే అభికి ప్రేమ చిగురిస్తుంది. ఈమె ప్రవృత్తి మాత్రం ఆత్మహత్య చేసుకొనేవారి చివరి కోరిక ప్రకారం ఎలా చనిపోతున్నారో కెమెరాతో షూట్‌ చేస్తుంది. 'ఐ హేట్‌ మై లైఫ్‌' అనే పేరుతో యూ ట్యూబ్‌లో అవన్నీ అప్‌లోడ్‌ చేస్తుంది.

No comments:

Post a Comment