Thursday, May 5, 2011

నాపై కత్తి వేలాడుతోంది.. అందుకే కాంగ్రెస్‌ తీర్థం: రమ్య




కర్నాటక సినీ పరిశ్రమలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటి రమ్య రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. అవకాశం వస్తే నన్ను ఇబ్బందుల్లోకి నెట్టెందుకు తనపై ఓ కత్తి వేలాడుతోందని పరోక్షంగా యడ్యూరప్ప సర్కార్‌పై ధ్వజమెత్తింది.

ఈ పరిస్థితుల్లో తప్పకుండా తను ఓ రాజకీయ పార్టీలో చేరాల్సిన అగత్యం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిప్రదాయని అయిన సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
యూత్ కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. సినిమా హీరోయిన్ కదా.. రాజకీయాలేం తెలుసని కొందరు అంటున్నారనీ, అయితే కాలేజీ రోజుల్లోనే నాయకత్వ బాధ్యతలు వహించానని గొప్పలు పోతోంది.

రాజకీయాల పట్ల యువత మైండ్ సెట్ చాలావరకూ మారినా, ఇంకా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. అవినీతి, స్వార్థపర రాజకీయ నాయకులను తరిమికొట్టి వారి పీచమణచాలంటే నిస్వార్థపరులైన యువత రాజకీయాల్లో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ ప్రయత్నంలో భాగంగనే తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలిపింది.

తనకు రాహుల్ గాంధీ అంటే ఎనలేని అభిమానమనీ, యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన చెపుతున్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని అంటోంది. కర్నాటక భవిష్యత్ రాజకీయాల్లో రమ్య ఓ లేడీ కాంగ్రెస్ లీడర్‌గా అవతరించబోతున్నదన్నమాట.

1 comment: