అనేక తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా తళుక్కున కనిపించిన మీరాచోప్రా.. ఒక వివాహితుడితో అక్రమ సంబంధం కలిగివున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఆ వ్యక్తి భార్య హత్య కేసులో చిక్కుకుంది. ఫలితంగా మీరాచోప్రాపై పోలీసులు నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. గుర్గావ్‌కు చెందిన రుచి భట్టాన్ అనే మహిళ జూన్ 28వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. రుచి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తమామలు చెబుతుండగా... భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.
అయితే, రుచి భర్త సుమిత్‌కు నటి మీరాచోప్రాతో వివాహేతర సంబంధం ఉందనే పుకార్లు ఉన్నాయి. దీంతో ఈ దశగా దృష్టి సారించి కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు.. సుమిత్‌ను అరెస్ట్ చేసి విచారించారు. సుమిత్ వెల్లడించిన సమాచారం మేరకు.. నటి మీరాచోప్రాపై ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి పోలీసు బృందాన్ని పంపించారు.

No comments:
Post a Comment