Friday, July 8, 2011

నాభీ నృత్యాల సుందరి సిమ్రాన్‌ సినిమాలకు గుడ్‌బై

ప్రౌఢసుందరి సిమ్రాన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. మంచి అవకాశాలకోసం చాలాకాలం వేచి చూసింది. పెళ్లయిన హీరోయిన్లకు............( ఐష్ తప్ప) ఎవరిస్తారు ఛాన్సులు...? అందుకే విసుగు చెందిన సిమ్రాన్ ఇకనుంచి సినిమాలకు టాటా చెప్పేస్తున్నట్లు సన్నిహితులతో అందట.

కెరీర్‌పరంగా మంచి ఊపులో ఉన్న సమయంలోనే సిమ్రాన్‌ పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుంది. మళ్ళీ నటించాలని వస్తే... వొదిన, అమ్మ( ఇంకా నయం అమ్మమ్మ పాత్రలిస్తామని అనలేదు)పాత్రలు వస్తున్నాయి. దీంతో చిర్రెత్తిన సిమ్ టాలీవుడ్‌ను తిట్టి పోస్తోంది.

వెండితెరలను వదిలేసి తన ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉండాలని నిర్ణయించుకున్నదట. ప్రస్తుతం ఓ బాబుకు తల్లి అయిన ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై సినిమాల్లో నటించననీ, కుటుంబానికే కేటాయిస్తానని చెప్పేసిందట.

No comments:

Post a Comment