Tuesday, August 2, 2011

హన్సికను చూసి టాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారా..?

హన్సిక పేరు చెబితేనే దక్షిణాది ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి ఛేంజ్ అయిపోయిందట. మొదట్లో అలాగే అనుకుని కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ యాపిల్ బ్యూటీకి ఛాన్సులు ఇచ్చారు. అయితే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. పైగా కోలీవుడ్ కుర్రకారు హన్సిక కంటే తమన్నాను చూస్తే చొంగ కార్చుకుంటున్నారట. ఆమె సినిమాలంటే ఎగబడి చూస్తుండటంతో తమన్నావైపే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారట.

అడపాదడపా కొంతమంది సంప్రదిస్తున్నప్పటికీ హన్సిక బ్యానర్ వేల్యూలను చూసి ఒప్పుకోవాలని అనుకుంటోందట. అయితే వీటికంటే టాలీవుడ్‌పై దృష్టి సారించడం బెటరని ఆమె సన్నిహితులు సలహా ఇచ్చారట.

ఇప్పటికే రామ్‌తో కందిరీగ చిత్రంలో అందాలను ఆరబోసిన హన్సిక పూర్తిగా టాలీవుడ్‌కే అంకితమైపోవాలని అనుకుంటోదట. అంటే ఇక్కడి కుర్రకారు హన్సికను చూసి చొంగ కార్చుకుంటున్నారని అనుకోవాలా...?!!

No comments:

Post a Comment