నటి ప్రియమణి 'యమదొంగ'లో ఎన్.టి.ఆర్.తో జత కట్టింది. అయితే ఆ తర్వాత ఆమెకు మళ్ళీ అంత రేంజ్‌లో హిట్ రాలేదు. ఏవో చిన్న చిత్రాల్లో నటించింది. లేటెస్ట్‌గా కె.ఎస్.రామారావు ఎన్.టి.ఆర్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కావాలి.
ఒక హీరోయిన్‌గా శృతిహాసన్ బుక్ అయింది. రెండో హీరోయిన్ ఛాన్స్‌ను తనకివ్వాల్సిందిగా ఎన్.టి.ఆర్.ను అడిగింది. మనది హిట్ కాంబినేషన్ అని ఎన్.టి.ఆర్.తో ఖాళీ దొరికినప్పుడల్లా గుర్తు చేస్తోందట.
కానీ... ఎన్.టి.ఆర్ దృష్టింతా తాప్సీ, దీక్షసేథ్‌లపై ఉందని తెలిసింది. ఇంకా రెండో హీరోయిన్ ఎంపిక కాలేదు. దీనిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మరి ప్రియమణిని ఏం చేస్తాడో చూడాలి.
No comments:
Post a Comment