ఏదీ మన చేతుల్లో లేదు.. అంతా పైవాడు ముందే రాసేస్తాడు
అమెరికాలో ఎం.బి.ఎ. చదివి ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిందని తన మనసులోని విషయాలను వెల్లడిస్తున్నారు డాక్టర్ డి.రామానాయుడు కుమారుడు విక్టరీ వెంకటేష్. ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మొగ్గుచూపే వెంకటేష్ "ఏదీ మన చేతుల్లో లేదు. అంతా పైవాడు ముందుగానే రాసేస్తాడు. దాన్ని మనం అమలు చేయాల్సిందేన"ని కించిత్ బాధను కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఈ జీవితంలో సంబంధాలు, పరిచయాలు, కలయికలు అనేవి ముందుగా మనకు తెలీయకుండానే రాసిపెట్టుంటాయని, కొన్ని పరిచయాలు కొంతకాలానికే పరిమితమంటూ... మీరంతా నా గురించి రాయడానికి వచ్చిన జర్నలిస్టులు... ఇదెప్పుడో పైవాడు అలా రాసి పెట్టారు కాబట్టి వచ్చారని.... చమక్కులు కూడా పేల్చారు. వెంకటేష్ తొలిసినిమా 'కలియుగ పాండవులు' ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై ఈనెల 14వ తేదీ ఆదివారం నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ....
మీరు ఈ రంగంలోకి రాకపోయి ఉంటే గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అయ్యేవారా?
గ్రేట్ అని చెప్పలేను కానీ... మంచి ప్లేయర్ అయ్యేవాడిని. సినిమాలోకి రాకముందు క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. బంధువులు, స్నేహితులు కూడా... కలిసినపడుల్లా క్రికెట్ గురించి అడిగేవారు. నీకు వచ్చిన గేమ్‌ను ఎందుకు వదిలేశావ్ అంటుంటేవారు. ఏదైనా అది మనచేతుల్లో లేదు. అయినా.. నేను ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయాను.
ఎక్కడ టోర్నమెంట్‌లు జరిగినా అక్కడ ఉండేవాడిని. విదేశాల్లోకి వెళతే.. అంతా నన్ను చూసి గుర్తుపడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి కనబడి.. మీరు అన్ని మ్యాచ్‌ల్లో ఉంటారు.. ఏం చేస్తుంటారన్నాడు.. నేను హీరోని అనిచెప్పాను... ప్లేయర్‌గా మంచి బాడీ ఉందని ఎప్లాజ్ చేశాడు.
No comments:
Post a Comment