Monday, August 29, 2011

నైట క్లబ్‌లో అమ్మాయిలతో హామ్ చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్స్


Cricket Stars 
టిమిండియాని 4-0తో ఓడించి టెస్టు సిరిస్‌ని కైవసం చేసుకొవడమే కాకుండా నెంబర్ వన్ స్దానానికి ఎగబాగింది ఇంగ్లాండ్. ఈ విజయంలో ఇంగ్లాండ్ యువ ఆటగాళ్ల కీలకపాత్ర పోషించారు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. సాధారణంగా ఒక విజయం రాగానే దానిని ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంబారాన్నే ఇంగ్లాండ్ యువ ఆటగాళ్లు జేమ్స్ ఆండ్రన్, మ్యాట్ ప్రేయర్, స్టువర్ట్ బ్రాడ్, టిమ్ బ్రెన్సన్‌లు మేఫెయిర్‌లో ఉన్న మహికి నైట్ క్లబ్‌‍లో అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు.

ఇక వివరాల్లోకి వెళితే 29 సంవత్సరాల వయసు కలగిన ఆండ్రసన్, ప్రేయర్ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకొని పిల్లలకు తండ్రులు కూడా అవడం జరిగింది. 26 సంవత్సరాల వయసు కలిగిన బ్రెన్సన్ తన గర్ల్ ప్రెండ్‌తో రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నాడు. ఈతరం కుర్రవాడు స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే బ్యాచలర్ జీవితాన్ని గడుపుతున్నాడు. అంతక ముందు హీరోయిన్ క్యాసీ బార్న్‌ఫీల్డ్‌తో చిన్న ఎపైర్ నడిపి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది.

ఇది ఇలా ఉంటే ఇండియాపై టెస్టు సిరిస్‌ నెగ్గిన తర్వాత నెంబర్ స్దానాన్ని కైవసం చేసుకొవడం జరిగింది. తర్వాత ఇండియాతో ఒక టిట్వంటీ, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆగస్టు 31నుండి ఆడాల్సి ఉంది. ఈ మద్యలో ఖాలీగా ఉండడం ఎందుకనుకున్నారో ఏమో కుర్రాళ్లు మహికి నైట్ పబ్‌కి వెల్లడం జరిగింది. వీరితో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు రావడం జరిగింది. పబ్‌కి వచ్చిన నలుగురు అందమైన అమ్మాయిలు కూడా టైట్‌గా తమయొక్క తోడలు కనిపించేలా డ్రస్సులు వేసుకొని పబ్‌కి రావడంతో అక్కడున్న వారంతా వారివైపే చూడడం మొదలుపెట్టారు.

పబ్‌లోకి వచ్చిన క్రికెటర్స్ వారియొక్క విఐపి గ్యాలరీలో అమ్మాయిలతో పాటు హిప్ హాప్ డాన్స్ చేస్తూ సుమారు మూడు గంటలు గడిపారని సమాచారం. క్రికెటర్స్ ఒక్కసారిగా అలా పబ్‌లోకి రావడంతో అక్కడున్న అమ్మాయిలు అందరూ వారివైపే అదోలా చూడసాగారు. రాత్రి 11గంటలకు పబ్‌లోకి వచ్చిన క్రికెటర్స్ తెల్లవారు జామున రెండు గంటల వరకు ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ప్రేయర్, బ్రాడ్ ఇద్దరూ కోకోనట్ రమ్ త్రాగడం జరిగింది. అదే పబ్‌లో అంతక ముందుగానే అక్కడకు తన తమ్ముడుతో చేరుకున్న కెవిన్ పీటర్సన్ కూడా మందు త్రాగడంలో వారికి తోడుగా నిలిచాడు.

No comments:

Post a Comment