![]() |
బయట రేప్‌లు జరిగినా, సినిమాల్లో రేప్ సీన్లు జుగుప్సాకరంగా చిత్రీకరించినా వాటిపై వ్యతిరేకంగా పోరాడడానికి మహిళా సంఘాలు రెడీగానే ఉంటాయి. అలాగే 'తెలుగమ్మాయి' చిత్రంలో రేప్ సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని కుటుంబాలతో కలిసి చూడలేమని లక్ష్మీపార్వతి తేల్చిచెప్పారు. సలోని కథానియకగా నటించిన ఈ చిత్రాన్ని హరిరామజోగయ్య సమర్పిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అయితే ముందుగానే ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఓ షో వేసి కొంతమంది కాలేజీ విద్యార్థినులకు చూపించారు. వారు మాత్రం పెద్దగా స్పందిచలేదు. దాంతో రాజకీయపార్టీ మహిళా సంఘాలకు ఫిలిం ఛాంబర్‌లో స్పెషల్ షో వేశారు.
షో తర్వాత... ఒకరిద్దరు మహిళా ప్రతినిధులు తాము మాట్లాడేందుకు ఏమీ లేదనీ.. దర్శకత్వం బాగోలేదని హరిరామజోగయ్యతో అన్నారు. దాంతో ఆయన.. మిగిలిన కొద్దిమందితో మాట్లాడించారు. అందులో లక్ష్మీపార్వతి ఒకరు. ఆమె మాట్లాడుతూ... ఆడపిల్లలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు చేసే రాక్షసులపై తెలుగమ్మాయి ఎలా చంపి బుద్ధి చెప్పిందేనని పాయింట్ చాలా బాగుంది. నిర్మాత దర్శకులు అభిరుచి మెచ్చదగింది.
కానీ దర్శకత్వంలో పర్‌ఫెక్షన్ లేదు. అలాగే రేప్‌సీన్స్ చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా తగ్గించుకోండని సూచించింది. ఆ తర్వాత మాట్లాడిన గంగాభవాని, సరోజనీదేవి, శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ, సినిమా బాగా తీశారని మహిళలు ఒక శక్తిగా ఎలా ఎదగాలో చెప్పారని అన్నారు.

No comments:
Post a Comment