Thursday, September 1, 2011

"దేవరాయ"లో కృష్ణదేవరాయలుగా శ్రీకాంత్‌

శ్రీకాంత్‌ కృష్ణదేవరాయలుగా కన్పించబోతున్నారు. నానికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న 'దేవరాయ' చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఓపెనింగ్‌ షాట్‌కు రామ్‌చరణ్‌ క్లాప్‌ కొట్టగా, చోటాకెనాయుడు స్విచ్చాన్‌ చేశారు. వినాయక్‌ దర్శకత్వం వహించారు.శ్రీకాంత్‌ మాట్లాడుతూ, 1500 సంవత్సరాలనాటి సంఘటనను కల్పితకథగా తీర్చి నేటి ట్రెండ్‌కు తగినట్లు కథను తయారుచేశారు. ఈ కథ విన్నప్పుడు చేయలేమోనని అనుకున్నాను. కానీ శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేసిన తర్వాత చేయగలనని నమ్మకం ఏర్పడింది. ఇందులో ఈనాటి ట్రెండ్‌ దొరబాబుగా కూడా నటిస్తున్నాను. చిత్ర నిర్మాత స్నేహితుడు. సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు. అందరం కష్టపడి చిత్రాన్ని చేస్తున్నామని తెలిపారు.

సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ, ఇటువంటి తరహా సినిమా చేయడం తొలిసారి. ఆకాలంనాటి సంగీతం అందించాలి. అన్ని రకాల సంగీతాలు ఇందులో ఉంటాయి. శ్రీకాంత్‌ రెండు పాత్రలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. అని చెప్పారు.

దర్శకుడు నానికృష్ణ మాట్లాడుతూ, దేశభాషలందు తెలుసులెస్స అంటారు. మరోసారి అందరికీ గుర్తుచేయాలని ఈ చిత్రం చేస్తున్నాం. రాయల ఔన్నత్యం, దానదర్మాలు, సాహిత్యపోషణ అన్నీ ఉంటాయని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌ మాట్లాడుతూ, వచ్చేనెల 13నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందనీ, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment