Thursday, September 29, 2011

భార్యకు లైంగిక సుఖం అందించలేకపోతున్నావా.. ఐతే పరిహారం చెల్లించు..!



భార్యభర్తల మధ్య లైంగిక సంబంధాలు లేకపోయినా పరిహారం చెల్లించాలని ఫ్రాన్స్‌లోని ఒక కోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది. భార్యకు లైంగిక సుఖం ఇవ్వనందుకుగాను పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం యూరప్‌లో విశేష వార్తగా మారింది....వివరాల్లోకి వెళితే... ఫ్రాన్స్‌లో జీన్ లూయిస్ అనే ఏభై ఒక్క ఏళ్ల వ్యక్తి భార్య ముందుగా విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. సంసారసుఖం లేనందున తన విడాకులు మంజూరు చేయాలని కోరింది. అందుకు కోర్టు అంగీకరించి విడాకులు ఇచ్చింది.

ఐతే అంతటితో ఆగకుండా తనకు ఇరవై ఒక్క ఏళ్లపాటు లైగింక సుఖం లేకుండా చేసినందుకుగాను పరిహారం చెల్లించాలని మాజీ భర్తపై ఆమె దావా వేసింది. ఈ కేసును విచారించిన ఒక ఉన్నత కోర్టు దీనికి అంగీకరించి 8500 పౌండ్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఫ్రెంచ్ పౌర నియమావళి ఆర్టికల్ 215 ప్రకారం వివాహిత జంట సహజీవనానికి, శారీరక సంబంధాలకు అంగీకరించాలి. భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు వారిలోని అనురాగాన్ని పెంచుతాయని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. కాగా ఆ భర్త జీన్ అలసిపోవడం, ఆరోగ్య సమస్యల వల్ల సెక్స్‌లో పాల్గొనలేకపోయానని కోర్టులో తెలపడం

No comments:

Post a Comment