శ్రీహరి
హీరోగా పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న
చిత్రం 'టీ..సమోసా. బిస్కెట్'... ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది.
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ఈనెల 14నుంచి జరగనుంది. దీనికోసం ఈనెల ఆరంభంలోనే
సారథి స్టూడియోస్‌లో ఓ సెట్ వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కోఠి సెంటర్ నేపథ్యంలో సాగే కథ గనుక కోటిని తలపించే సెట్‌ను యుద్ధప్రాతిపదికపై తయారు చేస్తున్నారు. ఈసెట్ ఈనెల 12తో పూర్తవుతుందనీ, 14నుంచి షూటింగ్ జరుపుతామని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు. కామెడీ, యాక్షన్‌తో సాగే ఈ చిత్రం కొత్తతరహాలో ప్రెజెంట్ చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీహరి సరసన హంసానందిని నటిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.

No comments:
Post a Comment