Sunday, October 9, 2011

మళ్లీ వెండితెరపై కనిపించనున్న సోనియా అగర్వాల్

ఆ మధ్య "7/జి బృందావన కాలనీ" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కథానాయిక సోనియా అగర్వాల్. ఆ తర్వాత తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహం చేసుకుని కొద్దికాలం వంటింటికి పరిమితయ్యారు...... దీంతో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. వారి దాంపత్య జీవితం బెడిసికొట్టడంతో విడాకులు తీసుకుని ఇపుడు ఒంటరిగా జీవిస్తోంది. దీంతో మళ్లీ వెండితెరపై కనిపించాలని ఉవ్విళ్ళూరుతోంది. తాజాగా సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో యస్.జి.ఫిల్మ్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాజ్‌కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి గీత నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రసీమలో కథానాయికలు ఎదుర్కొనే సమస్యలు, వారి కష్టనష్టాలు, జీవన విధానం చుట్టు అల్లుకున్న కథ ఇది. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. వినోదంతో పాటు అన్ని భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత తెలిపారు.

No comments:

Post a Comment