Saturday, October 29, 2011

"వనకన్య వండర్ వీరుడు" సిలిండర్ ఆర్తీకి కలిసొస్తుందా!?

ఆర్తీ అగర్వాల్ గుర్తుందా..? అదేనండీ మెగాస్టార్ చిరంజీవి "ఇంద్రా"లో నటించిన ఆర్తీ అగర్వాల్.. మళ్లీ తన అదృష్టాన్ని టాలీవుడ్‌లో పరీక్షించుకోనుంది............ తొలి ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఆర్తీ అగర్వాల్‌కు "నేనున్నాను" చిత్రం ద్వారా సిలిండర్ అనే పేరొచ్చింది.

తర్వాత ఈ అమ్మడుకు ఆఫర్లు మెల్ల మెల్లగా కరువయ్యాయి. దీనికి తోడు ఓ హీరోతో ప్రేమ విఫలం కావడంతో ఆర్తీ సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆర్తీని కదిలించే నిర్మాతలు లేకపోవడంతో అమ్మడు పెళ్లి చేసుకుని అమెరికాకు తుర్రుమంది.

ఈ నేపథ్యంలో, పెళ్లికి తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆర్తీ అగర్వాల్‌ తాజాగా సోషియో ఫాంటసీ సినిమా "వనకన్య వండర్ వీరుడు" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు సంపాదించి పెడుతుందని ఆర్తీ అగర్వాల్‌ నమ్ముతోంది.

శివంగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ ఐదో తేదీన విడుదల కానుంది. మరి సిలిండర్ ఆర్తీ అగర్వాల్‌కు ఈ సినిమా ఎంత మేరకు కలిసొస్తుందా వేచి చూడాలి..!

No comments:

Post a Comment