Monday, October 31, 2011

విడుదల సన్నాహాల్లో 'ఉసురు' సినిమా

Madhavilatha
సరికొత్త కథాకథనాలతో రూపొందిన 'కొత్తకథ' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై..... అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించి, అదే చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్‌ చేసిన వేణు.ఆర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉసురు' పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ అతి త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

'దెయ్యాలున్నాయి.. నిజం' అనే ట్యాగ్‌లైన్‌తో.. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన 'ఉసురు' ఇంతకుమునుపు తెలుగులో ఘనవిజయం సాధించిన 'అరుంధతి', 'కాంచన' చిత్రాల సరసన నిలుస్తుందనే ఆశాభావాన్ని వేణు.ఆర్‌ వ్యక్తం చేస్తున్నారు.

'ఆర్‌.వి.జి మూవీస్‌' పతాకంపై రుధ్రాభట్ల వేణుగోపాల్‌-ఏపూరి సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవీలత, సుభాష్‌రాయల్‌, అభినయ, దుర్గేష్‌, కామేశ్వర్రావు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాతల్లో ఒకరైన ఏపూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. 'కొత్తకథ' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న మా దర్శకుడు వేణు 'ఉసురు' చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు.

'చంద్రముఖి', 'అరుంధతి', 'కాంచన' చిత్రాల కోవలో నిలిచే చిత్రంగా 'ఉసురు' రూపొందింది. జయకుమార్‌ సంగీతం, అనిల్‌కుమార్‌ ఎడిటింగ్‌, జయచంద్రుని రవికుమార్‌ డైలాగ్స్‌ సినిమాకు ఆయువుపట్టుగా నిలుస్తాయి. ఈ చిత్రంతో వేణు పేరు అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోతుంది. ప్రస్తుతం డిటియస్‌ మిక్సింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ఉసురు' చిత్రాన్ని ఈనెల రెండో వారంలో విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాం. హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారందరినీ 'ఉసురు' విశేషంగా అలరిస్తుందన్న నమ్మకం మాకుంది' అన్నారు!

No comments:

Post a Comment