విక్టరీ
వెంకటేష్ హీరోగా మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్
సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై గోపీచంద్
మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు
నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బాడీగార్డ్'. ఈ చిత్రం జనవరి
12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.............ఈ
సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ''ఒక్క పాట మినహా
షూటింగ్ మొత్తం పూర్తయింది. డిసెంబర్‌లో ఆడియో రిలీజ్ చేసి జనవరి 12న
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం.
థమన్ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. వెంకటేష్ బాబు
కెరీర్‌లోనే ఓ విభిన్న చిత్రంగా 'బాడీగార్డ్' రూపొందుతోంది. మా బేనర్‌లో
వెంకటేష్‌బాబు చేస్తున్న ఈ రెండో సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న
నమ్మకం నాకు వుంది'' అన్నారు.
వెంకటేష్, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతంరాజు, డాన్స్: రాజుసుందరం, బృంద, విష్ణుదేవా, కో-డైరెక్టర్: సురేష్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసాద్ మైనేని, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

No comments:
Post a Comment