నటీనటులు: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్, ఆర్.కె., రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్, గీతాంజలి తదితరులు;
కెమెరా: శ్రీకాంత్, ఎడిటింగ్: గౌతంరాజు, సంగీతం: బాబూ శంకర్, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.................................................కృష్ణవంశీ సినిమాలంటే ఏదో కొత్తదనం ఉంటుందనీ, సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడని తెలుసు. అయితే ఆ కోణంలో అతను ఏం చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాడు అనేది ఓపిగ్గా చూడాలనుకుంటే "మొగుడు" చూడాల్సిందే.
కథలోకి వెళితే...
ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్) వ్యవసాయంలో కష్టపడి పైకి వచ్చి రాష్ట్రపతి చేత అవార్డు కూడా పొందుతాడు. తన భార్య చనిపోవడంతో ముగ్గురు కుమార్తెలు, కొడుకులను తనే చూసుకుంటూ.. తననుకున్నట్లు అల్లుళ్ళని ఇల్లరికం చేసుకుంటాడు. అతని సమస్యల్లా కొడుకు రాంప్రసాద్(గోపీచంద్)కు అర్జంట్‌గా పెండ్లి చేయడమే. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే అచ్చమైన తెలుగు అమ్మాయి ఇంటి కోడలు కావాలని కోరుకుంటాడు.
అనుకున్నట్లే రాజకీయనాయకురాలు చాముండేశ్వరి(రోజా), నరేష్‌ల కుమార్తె బుజ్జితో రాంప్రసాద్‌కు ఏర్పడిన పరిచయం పెండ్లి వరకు దారితీస్తుంది. పెద్దలు పెండ్లి చేస్తారు. కోడలిని ఇంటికి తీసుకెళుతూ గౌరీదేవిని(గౌరీపూజ చేసిన అమ్మవారి విగ్రహాన్ని) కూడా తెమ్మంటారు. గౌరీదేవీని ఇచ్చేస్తే ఇంటి లక్ష్మి పోతుందని చాముండేశ్వరి ససేమిరా అంటుంది. దాంతో చిలికిచిలికి గాలివానలా మారి ఒకరినొకరు కొట్టుకుంటారు. ఫలితంగా వివాహం పెడాకులవుతుంది.
మెంటల్ రిలీఫ్ కోసం రాంప్రసాద్ మలేషియా బయలుదేరతాడు. అదే ఆలోచనతో వచ్చిన బుజ్జికూడా తన మొగుడు పక్కన పాత స్నేహితురాలు జోత్స్య (శ్రద్దాదాస్) ఉండటం చూసి తట్టుకోలేక వారిని ఫాలో అవుతుంది. అలా మలేషియా వెళ్ళి వారిని విడదీయాలని ట్రై చేస్తుంది. ఆ దశలో జరిగిన కొన్ని సంఘటనల్లో రాంప్రసాద్, బుజ్జి మళ్ళీ పెండ్లిచేసుకుంటారు. తిరిగి ఇంటికి వచ్చాక చాముండేశ్వరి చిందులేస్తుంది. రాంప్రసాద్‌ను చంపేయమని అనుచరులను రెచ్చగొడుతుంది. ఆ తర్వాత మొగుడు ఏం చేశాడు? చివరికి ఏమయింది? అనేది కథ.
ప్రొడక్షన్ వాల్యూస్ నల్లమలుపు బుజ్జి ఎంత బాగా సపోర్ట్ చేసినా దర్శకుడు కృష్ణవంశీ తను ఎంచుకున్న కథను చెప్పే విధానంలో గాడితప్పాడు. ప్రేమికులకు అటువైపు కానీ ఇటువైపువారు కానీ విలన్స్‌గా చూపించడం చూస్తునే ఉన్నాం. కృష్ణవంశీ మొగుడు కథకు విలన్... సంప్రదాయం కట్టుబాట్లే. పెండ్లికి ముందు పెండ్లికూతురు పూజించే గౌరీదేవీని కొన్ని సంప్రదాయాల ప్రకారం పెండ్లికుమార్తెతోపాటు పంపిస్తారు. మరికొన్ని కుటుంబాల్లో పంపించరు. అది అపశకునంగా భావిస్తారు.

No comments:
Post a Comment