Monday, November 7, 2011

నవంబర్‌ 12న విజయవాడలో 'దూకుడు' విజయోత్సవం!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా సూపర్‌డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో జి.రమేష్‌బాబు సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట,.............. అనీల్‌ సుంకర నిర్మించిన బ్లాక్‌ బస్టర్‌ 'దూకుడు' విడుదలైన అన్ని కేంద్రాల్లో దిగ్విజయంగా 50రోజులు పూర్తి చేసుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌,గోపి, అనీల్‌ మాట్లాడుతూ - ''80 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళతో, అత్యధిక కేంద్రల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంటూ అన్ని రికార్డుల్ని తిరగరాసిన 'దూకుడు' చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో నవంబర్‌ 12 సాయంత్రం 5గంటలకు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజి గ్రౌండ్స్‌లో వైభవంగా జరుపుతున్నాం.

ఈ ఫంక్షన్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అతిరథ మహారధులతో పాటు 'దూకుడు' చిత్రం యూనిట్‌ మొత్తం పాల్గొంటుంది. 'దూకుడు' చిత్రానికి అఖండ విజయాన్ని అందించి ఇండస్ట్రీ నెంబర్‌వన్‌ గ్రాసర్‌గా నిలబెట్టిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం'' అన్నారు.

నవంబర్‌ 12న జరిగే 'దూకుడు' విజయోత్సవంలో పాల్గొనడానికి సూపర్‌స్టార్స్‌ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులంతా రాష్ట్రం నలుమూలల నుండి యమాదూకుడుగా విజయవాడ తరలివెళ్ళడానికి సన్నాహాలు చేసుకోవడం విశేషం.

No comments:

Post a Comment