![]() |
విదీషా...
తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన హీరోయిన్. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు
పరిచయమున్న నటి. "అత్తిలి సత్తిబాబు"లో అల్లరి నరేష్‌తో నటించింది. ఆ
తర్వాత తమిళ, కన్నడ చిత్రాలకు పనిచేసింది..........................అయినా అక్కడ తృప్తి చెందడం మాట
అటుంచి నిలదొక్కుకోలేక పోయింది. దీంతో
మళ్లీ తెలుగు వెండి తెరపైకి వచ్చింది. తెలుగులోనే మంచి ఆఫర్లు వస్తున్నాయి
భామకు. అందుకే ఈ అమ్మణి ఇటువైపు సారించింది. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా
"దేవరాయ" చిత్రంలో నటిస్తోంది. శ్రీకృష్ణదేవరాయ
బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో అమ్మడు కాస్త గ్లామర్‌గా
కన్పించనుంది. రాజవంశీయుల హోయలు ఒలకపోసింది. కథకు
తగినట్లుగా ఉన్న ఈ పాత్రలో శృంగారం అనిపించినా... అది మోస్తరుకు మించలేదని
నిర్మొహమాటంగా చెప్పేసింది. మరి సినిమా విడుదలయ్యాక ఎలా ఉంటుందోచూడాలి.
No comments:
Post a Comment