ఇలియానాకి ఇప్పుడు
డిమాండ్ కొద్దిగా తగ్గినా బాలీవుడ్ లో, ఇటు కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ
బిజీ గానే ఉంది. రణ్ బీర్ కపూర్ తో ‘బర్ఫీ’ తో బాలీవుడ్ అరంగ్రేటం
చేస్తున్న ఇలియానా అక్కడ తన అదృష్టం పరీక్షించుకోనుంది.అనురాగబసు
దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందుతోన్న ‘బర్ఫీ’ చిత్రంలో ప్రియాంక
చోప్రా, ఇలియానా, కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఇలియానా, ప్రియాంకల
మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ఇలియానాకే ఈ యూనిట్ ఇంపార్టెన్స్
ఇస్తోందని, రణబీర్ సైతం ఇలియానాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని బాలీవుడ్
వార్తా పత్రికలు వార్తలు ప్రచురించేస్తున్నాయి. అలాగే ఇలియానా, రణబీర్ కార్
వ్యాన్ లో గడుపుతూ గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారని కూడా రాస్తున్నాయట.
ఈ నేపథ్యంలో ఇలియానా స్పందిస్తూ ‘నేను ప్రియాంక చాలా క్లోజ్ గా ఉంటాము. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇక రణబీర్, నేను కార్ వ్యాన్ లో గంటలు గంటలు మాట్లాడుకుంటున్నామని వార్తలు రాసారు. షూటింగ్ గ్యాప్ లో ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అంత మాత్రానికే ఇలా రాయడం మంచిది పద్దతి కాదు’ అని చెప్పింది.

No comments:
Post a Comment