Tuesday, April 17, 2012

'దమ్ము'లో జూనియర్ ఎన్టీఆర్‌ ముందు వృద్ధ తారలా త్రిష..!

Trisha and NTR
 హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో టాలీవుడ్ స్క్రీన్‌ను హిట్ చేయబోతోన్న...................... చిత్రం జూనియర్ ఎన్టీఆర్ దమ్ము. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు నూటికి 150 మార్కులు వేస్తామంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఐతే ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ల గురించి మాత్రం ఫిలిమ్ నగర్ లో పలు వ్యాఖ్యలు తిరుగాడుతున్నాయి.

వయసు పెరుగుతున్నా దాన్నేమాత్రం కనబడనీయకుండా శరీరాన్ని బక్కగా పెడుతూ లాగించేస్తున్న త్రిష మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ముందు వృద్ధ తారలా కనిపిస్తోందని అంటున్నారట. వృద్ధ తారంటే... అని ప్రశ్నిస్తే.. ఏదేదో.. అనుకోకండి.. జూనియర్ ఎన్టీఆర్ కంటే త్రిష వయసులో పెద్దది కనుక అలా అంటున్నామని ట్విస్ట్ ఇస్తున్నారట.

ఇలాంటి కామెంట్లు త్రిష చెవికి కూడా చేరాయో ఏమోగానీ అమ్మడు పెళ్లికి సిద్ధమైపోయినట్లు సమచారం. తదుపరి చిత్రాల కోసం అడుగుతుంటే.. సమాధానం చెప్పడం లేదట. కనుక పెళ్లి చేస్కుని సెటిలైపోతుందని అంటున్నారు.

No comments:

Post a Comment