Monday, April 16, 2012

సంభోగంలో సంతృప్తి - రోజంతా ఆనందమయం!

young couple
భార్యాభర్తల మధ్య శృంగారంలో దంపతులిద్దరూ ఆనంద పరవశంలో మునిగి తేలితే................................. అలాంటి జంట రోజంతా ఆనందంతో ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సాధారణంగా శృంగారం సంతృప్తిగా అనుభవించిన పురుషుల్లో ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఉత్సాహంగా, ఆనందంగా ఉండటాన్ని మనం చూస్తుంటాం.

అదే ఆడవాళ్ల విషయంలో విషయంలో ఇలాంటి సంఘటన అరుదుగా చోటు చేసుకుంటుంది. ఆడవాళ్ళలో కూడా శృంగారం అనేది శరీరానికి, మనసుకు సంబంధించింది. ఈ రెండింటినీ సంతృప్తి పరిచినపుడే ఆ మహిళ ఆనందం పొందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, ఈ శృంగారం అనేది కేవలం భార్యాభర్తల మధ్య జరిగేదిగా ఉండాలి. అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కంటే ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. శృంగారంలో ఆనందం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉండగలుగుతారని వైద్యులు చెపుతున్నారు.

ఈ ప్రభావం దైనందిన జీవితంలో అన్ని విషయాలపై కొట్టొచ్చినట్లు కనబడుతుంది. శృంగారంలో తృప్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆందోళన తగ్గిస్తుంది. ఉద్యోగం చేసేవారిలో కూడా సంతృప్తికరమైన వైవాహిక జీవితం ఉన్నప్పుడు, ఉద్యోగంలో వచ్చే అనేక రకాల ఒత్తిడులను అధిగమించగలుగుతారట.

అంతేకాకుండా.. సెక్స్‌ అనేది ఒక నిద్రమాత్ర లాంటిది. కాఫీ లాంటిది. అలసటను, ఆందోళనను తగ్గించి సుఖమయ నిద్రను కలిగిస్తుందని చెపుతున్నారు. రోజంతా ఉత్సాహాన్నిస్తుందని చెపుతున్నారు. అలిసిన శరీరానికి సెక్స్‌ మందులా పనిచేస్తుందట. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ను దూరంగా ఉంచవచ్చు అన్నట్లే రోజూ భావప్రాప్తి కలిగితే ఆరోగ్యం బాగుంటుందని సెక్స్ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

No comments:

Post a Comment