Sunday, April 15, 2012

సినిమాల్లో నటిస్తా.. కానీ హీరో నా కంటే ఎత్తుగా ఉండాలి!: జ్వాలా

నేను నటించబోయే సినిమాలో హీరో తనకంటే పొడుగ్గా ఉండాలని అంటోంది...............................భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల. లేదంటే తానే హీరోగా, హీరోయిన్‌గా డబుల్ యాక్షన్ చేయాల్సి ఉంటుందని చమత్కరించింది. తెలుగులో ప్రభాస్ తన అభిమాన నటుడని, అతను అచ్చమైన దక్షిణాది నటుడిలా ఉంటాడని, కాబట్టే తనకు ఇష్టమని చెప్పింది. సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఇంతవరకు తాను ఏ సినిమా చేసేందుకు అంగీకరించలేదని, ప్రస్తుతం తన దృష్టంతా ఒలింపిక్స్‌పైనే ఉందని జ్వాలా వెల్లడించింది.  నటించడంలో తప్పేమీ లేదంటోంది. అయితే ముందుగా తన లక్ష్యం ఒలింపిక్స్ అని.. ఆ తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది. కాగా, ఇండియా ఓపెన్‌లో గెలుపే లక్ష్యంగా తాను బరిలో దిగుతున్నానని, ఇందుకోసం గత మూడు వారాలుగా సాధన చేస్తున్నానని చెప్పింది.

No comments:

Post a Comment