Monday, June 25, 2012

5-6 సార్లు హస్త ప్రయోగం చేస్తే కీళ్ల నొప్పులు వస్తాయా?

అనేక మంది యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి..................పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. వీరిలో కొంతమంది కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ప్రతి రోజూ ఐదారుసార్లు హస్త ప్రయోగం చేయడం వల్ల వస్తుందా అని అనుమానం వస్తుంది. దీనిపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే.. వారి అభిప్రాయాలను కింది విధంగా వెల్లడిస్తున్నారు.

హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని అంటున్నారు. వద్దనుకుంటూనే ప్రతీ పురుషుడు చేసుకునే పనే ఇదేనని చెపుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని ఘంటాపథంగా చెపుతున్నారు.

సెక్స్‌ భాగస్వామి లేనప్పుడు, సెక్స్‌లో పాల్గొనే అవకాశం కన్పించనప్పుడు అనుసరించదగిన క్షేమకర అలవాటు ఇదేనని అంటున్నారు. హస్తప్రయోగ సమయంలో చేతిలో అంగం ఎలా కదులుతుందో అదే కదలిక సెక్స్‌ సమయంలో యోనిలో జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి అతిగా హస్తప్రయోగం చేసుకోవడం, అంగం బలహీనపడడం అర్థం లేని మాటలు. అధికంగా మాట్లాడే వారి నాలుక ఎప్పుడైనా బలహీనపడడం చూశారా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఏ శరీర భాగమైనా సరిగా వాడకపోతే బలహీనపడుతాయి. కళ్ళ కింది నల్ల చారలు, కీళ్ళనొప్పులకు హస్తప్రయోగానికి సంబంధం లేదు. హస్త ప్రయోగం వల్ల లాభాలే ఉన్నాయని ఫ్రాయిడ్‌ చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ఒత్తిడి పోతుందని అక్రమ సంబంధాలకు పోయి రోగాలు తెచ్చుకోవడం జరగదని వైద్యులు చెపుతున్నారు.

No comments:

Post a Comment