Thursday, March 14, 2013

గడ్డం - మీసాలు రాలేదు ... వివాహానికి పనికొస్తానా?


చాలా మంది యువకులు యుక్త వయస్సుకు వచ్చినప్పటికీ.. గడ్డంపై వెంట్రుకలు, మీసాలు రావు. వయస్సు పెరుగుతున్నా ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ సెక్స్ కోర్కెలు మాత్రం బాగానే ఉంటాయి. అయితే, గడ్డాలు మీసాలు రాకపోవడంతో ఆ యువకులు తమలో తాము కుమిలి పోతుంటారు. గడ్డం మీసాలు వచ్చేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. వైద్యులను సంప్రదిస్తుంటారు. నిజానికి గడ్డం వెంట్రుకలు, మీసాలు రాకపోవడానికి కారణమేంటి. ఇలాంటి వారిలో సెక్స్ కోర్కెలు ఏ మేరకు ఉంటాయన్న అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. 

గడ్డాలు, మీసాలు అనేవి పెద్ద సమస్య కాదంటున్నారు. వీటితో బాధపడే వారు... ఆండ్రాలజిస్ట్‌ను కలిసి హార్మోన్‌ టెస్ట్‌ చేయించి తగిన విధంగా చికిత్స చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. దానివలన గడ్డాలు, మీసాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంగస్థంభన బాగానే ఉంది కాబట్టి శృంగారపరంగా ఏ సమస్యారాదని, అందువల్ల నిర్భయంగా వివాహం చేసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment