'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాప్ ఇప్పుడు చిత్ర యూనిట్ లో రచ్చ పెడుతోంది. ఈ మూవీ ఎన్టీఆర్ ఆగ్రహనికి కారణమయ్యింది. ఇప్పటికే హరీష్ శంకర్ పై గుస్సాగా ఉన్న యంగ్ టైగర్. ఇక ఈ మధ్య నిర్మాతపై
కూడా ఫైర్ అయ్యాడట. దీనికి కారణం తరచి చూస్తే.. సినిమా ప్రమోషన్ విషయంలో దిల్ రాజు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడని సమాచారం. అయితే మీడియా ముందు దిల్ రాజు 'సినిమా పోయాక ప్రమోషన్ ఎందుకు' అంటున్నాడనే మాట ఎన్టీఆర్ వరకూ చేరిందట. దీంతో ఎన్టీఆర్ అతనికి ఓ రేంజ్ లో క్లాస్ పీకాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ నిర్మాతే ఇలా చెప్పుకుంటే ఇక ఆ సినిమా పరిస్థితి ఏంటని బాద్ షా అంటున్నాడట. అయితే కొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో కట్ చేసిన సీన్లను పెట్టి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనిలో కూడా ఇలా పెట్టి ప్రమోషన్ చేయడంలో కూడా దిల్ రాజు కామ్ గా ఉంటున్నాడట. అంతేకాక కొన్ని చోట్ల దిల్ రాజు సొంత థియేటర్లలోనే ఈ సినిమాను తీసేస్తున్నారని సమాచారం. వచ్చేవారం చిన్న సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీని తొలగిస్తున్నట్లు టాక్. కానీ రామయ్యలో ట్రిమ్ చేసిన సీన్స్ పై మరింత ప్రచారం చేసి దీపావళి కలెక్షన్ల వరకూ ఉంచవచ్చు కదా అనేది ఎన్టీఆర్ వాదన. కానీ ఇవేవి పట్టకుండా నిర్మాత ఉండడంతో ఎన్టీఆర్ ఆగ్రహనికి కారణమయ్యిందని టాలీవుడ్ సమాచారం. సో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న ఈ మేటర్ పై దిల్ రాజు ఏం చెబుతాడో అని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

No comments:
Post a Comment