Tuesday, November 19, 2013

మునగకాడలోని ఆరోగ్యప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, తాజాగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ మరియు పండ్ల కంటే మరోకటి మంచి ఆరోగ్యానికి సహకరించవు. ప్రస్తుత జీవన శైలిలో వీటన్నింటిని చాలా అలక్ష్యంచేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యుల్ తో వారు ఇంటి ఆహారం కంటే, జంక్ ఫుడ్ మీద ఎక్కువగా ఆధారపడటానికి మొగ్గుచూపుతున్నారు. దాంతో శరీరానికి అవసరం అయ్యే అనేక ప్రోటీనులు, మిటమినులు లోపంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకు అన్ని రకాల కూరగాయలను రెగ్యులర్ గా తీసుకొంటున్నారా లేదా అని ట్రాక్ చేయడం చాలా కష్టం. సీజనల్ గా అందుబాటులో ఉండే వెజిటేబుల్స్, మునగకాడలను మన ఇండియాలో విరివిగా ఉపయోగపడుతున్నాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. -విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు. మరి మునగకాడలోని ఆరోగ్యప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment