Friday, November 29, 2013

మీ శరీరంలోని ఈ నొప్పులను అశ్రద్ద చేయకండి


మనలో చాలా మంది అప్పుడప్పుడు ఉన్నపలంగా ఆనారోగ్యపాలవుతుంటారు. ముఖ్యంగా ఉన్నట్లుండి నొప్పులు మరియు నొప్పి యొక్క లక్షణాలు శరీరంలో మొదలవుతుంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ సర్వ సాధరణంగా ఉంటాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం అవి ఎందుకు వస్తుంటాయో తెలియదు. కొన్ని నొప్పులకు మాత్రం ఫిజికల్ స్ట్రెస్ మరియు స్ట్రెయిన్, అనారోగ్యరంగా తినడం మరియు జీవనశైలి మరియు అపక్రమ వ్యాయామాలు ఇలా చాలా కారణాలుంటాయి.మనకు తెలియకుండా, మరియు మనం కనిపెట్టలేనటువంటి లక్షణాలు ఏవైనా మనలో కనిపించినప్పుడు మన శరీరంలో ఏదో జరకూడనిది జరుగుతోందని పసిగట్టాలి. బాడీ పెయిన్స్ అనేవి సహజమైనా, వాటిని తేలికగా తీసుకోకూడదు. తరచూ మరియు పదేపదే వచ్చే బాడీపెయిన్స్ మన శరీర జీవక్రియల్లో కొన్ని సమస్యల తెలియజేస్తాయి . ఆరోగ్యపరంగా తలనొప్పి, కీళ్ళనొప్పులు, బాడీపెయిన్స్ అనేటివి సాధారణంగా వచ్చినా కూడా, ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగినా లేదా ఎక్కువ నొప్పి బాధిస్తున్నా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు, మైగ్రేన్ లేదా మెదడుకు సంబంధించ ఆరోగ్య సమస్యలు అయుండవచ్చు. అవి ప్రాణానికి ముప్పు తీసుకొస్తాయి. కాబట్టి అటువంటి వాటిల్లో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని కొన్నిఆరోగ్య లక్షణాలు మీకోసం వివరించబడింది.

No comments:

Post a Comment