Sunday, December 1, 2013

గూగుల్ నెక్సస్ 5..


గూగుల్ అంటేనే ఇన్నోవేషన్ కి ఇంకో వర్షన్. అదిప్పుడు మొబైల్ కంపెనీలతో టై అప్ అయి క్రేజీ స్మార్ట్ ఫోన్స్ ని డిజైన్ చేస్తోంది. ఇప్పడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్ తో ఫస్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. గూగుల్, ఎల్ జీతో కలిసి లాంచ్ చేసిన నెక్సస్ 5 స్మార్ట్ ఫోన్ కు వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. గూగుల్ బ్రాండ్ ఇమేజ్ లో-కాస్ట్ లో దొరుకుతోంది. దానికి హై ఎండ్ ఫీచర్స్ యాడ్ అయ్యాయి. 50 థౌజండ్ కాస్ట్ మొబైల్స్ లో ఉండే అన్నిఫీచర్లూ 30 వేల రూపాయలకే దొరుకుతుండడంతో కస్టమర్లు ఎట్రాక్ట్ అవుతున్నారు.
   వరల్డ్ వైడ్ గానే కాదు.. ఇండియాలోనూ నెక్సస్ 5 హాట్ కేక్ లా సేల్ అవుతోంది. ఆపిల్ 5ఎస్ తర్వాత ఇక్కడ అంత స్పీడ్ గా సేల్ అయిన మోడల్ ఇదేనని టెక్ టాక్. రిలీజైన ఫ్యూ అవర్స్ లోనే గూగుల్ ప్లే స్టోర్ లో నో స్టాక్ బోర్డ్ డిస్ ప్లే అయిందంటే దీనికున్న డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
గూగుల్ నెక్సస్ 5 ఫీచర్స్..
   
గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ తో ఫస్ట్ అండ్ ఫ్రెష్ గా వస్తున్న మోడల్ నెక్సస్ 5. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 2.26 గిగా హెడ్జ్ ప్రాసెసర్, 4.95 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్ , 2,300 ఎమ్ ఏ హెఎచ్ బ్యాటరీలు దీనిలోని కామన్ ఫీచర్లు. 8 మెగా పిక్సెల్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి అదిరిపోయే ఫీచర్లున్నాయి.
   గూగుల్ నెక్సస్ 5 మొబైల్ 4జీ ఎల్ టీఈ సపోర్ట్ చేస్తుంది. ప్రీవియస్ వర్షన్స్ కన్నా బ్రౌజింగ్ స్పీడ్, ప్రాసెసర్ వర్కింగ్, స్క్రీన్ స్పీడ్, ఫ్రేమ్స్ పర్ సెకన్, జావా స్క్రిప్ట్ లాంటి ఎక్స్ ట్రా ఆప్షన్స్ తో దీన్ని అప్ గ్రేడ్ చేశారు. ఇన్ని అల్టిమేట్ ఆప్షన్స్ తో దేశీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఈ మోడల్ రికార్డ్ క్రియేట్ చేస్తుందంటున్నారు నిపుణులు. నెక్సస్ 5 రిలీజై వన్ వీక్ అయింది. ఫస్ట్ ఫేజ్ గా ఇండియాకు వచ్చిన 15,000 యూనిట్స్ లో 5000 గూగుల్ ప్లే స్టోర్ లోనే సేల్ అయిపోయాయి. ఈ ఫేజ్ లో 16 జీబీ మోడల్ ను మాత్రమే రిలీజ్ చేశారు. దీని ప్రైస్ 28,999 రూ. 32 జీబీ మోడల్ ఈ వీకెండ్ లో వస్తోంది. దీని ప్రైస్ 32,999 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ప్రైస్ రీజనబిలిటీ కూడా ఈ ఫోన్ కు ఇంత క్రేజ్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు ఆండ్రాయిడ్ ఎనలిస్టులు. ఇప్పటి ఫోన్స్ లో సేల్స్ వైస్ చూస్తే ఫస్ట్ ప్లేస్ నెక్సస్ 5 దే అంటున్నారు అంతా.
హెచ్ టీసీ వన్ మ్యాక్స్ ఫ్యాబ్లెట్..
   
గూగుల్ కొత్త కొత్త కంపెనీలతో టై అప్ అయి కొత్త మొబైల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే హెచ్ టీసీ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఓన్ చేసుకుంటూ, లేటెస్ట్ ఫీచర్స్ ని అప్ డేట్ చేస్తూ నయా మొబైల్స్ ను టెక్ లవర్స్ కు అందిస్తోంది. ఇప్పుడు అదే సక్సెస్ ఫార్ములా ను ఫాలో అవుతూ హెచ్ టీసీ ఫస్ట్ ఫ్యాబ్లెట్ ను టెక్ బజార్ లోకి లాంచ్ చేసింది.
వన్ మ్యాక్స్ ఫీచర్లు..
   
ఈ ఫ్యాబ్లెట్ లో 5.90 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ స్క్రీన్, 1.7 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, హెటీసీ అల్ట్రా పిక్సెల్స్ కెమెరా, 3, 300 ఎంఏహెచ్ బ్యాటరీ దీని కామన్ ఫీచర్లు. 16, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో 2 వేరియంట్స్ లలో ఎవైలబుల్ గా ఉంది. 4 జీ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ 56 థౌజండ్ రూపీస్.
ఫోన్ కు రిమోట్..
   
హెచ్ టీ సీ వన్ మ్యాక్స్ ఫ్యాబ్లెట్ బిగ్ సైజ్ లో ఉండడం వల్ల దీనికి స్పెషల్ యాక్సెసరీని యాడ్ చేశారు. అదే హెటిసి వన్ మినీ ప్లస్ అనే రిమోట్. దీని నుంచి ఇ-మెయిల్, ఎస్ ఎమ్ ఎస్ తో పాటు కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా కాల్స్ కూడా చేసుకోవచ్చు. ధర రూ.7,500.
ఫెచ్..
   
ఫెచ్ పేరుతో హెచ్ టీసీ చేతిలో ఫిట్ అయ్యే మరో స్మార్ట్ గ్యాడ్జెట్ ను కూడా లాంచ్ చేసింది . మీ ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే ఇది చేతిలో ఉంటే చాలు ఫోన్ ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. దీని ధర రూ. 2,500.
   ఈ ఏడాది హెచ్ టీసీ ఇండియాలో మొత్తం 10 స్మార్ట్ ఫోన్లు ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా 4 మోడల్స్ రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ ఫ్లాట్ ఫాం పై కొత్త మొబైల్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతోంది.
పిల్లలను అకట్టుకునే అనామలీ 2..
   
అనామలీ సిరీస్ లో వస్తున్న రెండో గేమ్ అనామలీ 2. అనామలీ వార్ జోన్ ఎర్త్ పేరుతో వచ్చిన ఫస్ట్ గేమ్ కి ఇది సీక్వెల్. ఇందులోని కోర్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా లిటిల్ బిట్ ప్రెట్టీ స్టైల్ లో అనామలీ 2 వచ్చింది. హార్డ్ కోర్ టవర్ డిఫెన్స్ లో ఇదో హాట్ గేమ్. ఫస్ట్ గేమ్ కంటే సీక్వెల్ గా వచ్చిన ఈ గేమ్ లో ఎన్నో కొత్త ఎలిమెంట్స్ ని, ఎనిమీస్ ని యాడ్ చేశారు. మార్ఫింగ్ మొబైల్ మెచ్ యానిట్స్ అంటే.. మీ వెహికిల్స్ ని ఏ రకంగానైనా మార్చుకునే, వెపన్స్ గా చెయింజ్ చేసుకునే ఫీచర్ ని కూడా యాడ్ చేశారు. మల్టీ ప్లేయర్ మోడ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. టవర్ టిఫెన్స్ తో పాటు టవర్ అఫెన్స్ ను కూడా యాడ్ చేశారు. ఒరిజినల్ గేమ్ కంటే ఈ గేమ్ లో ఫెన్ టాస్టిక్ టెక్నికల్ ప్రజెంటేషన్ ఉంది. 2018 ఫ్యూచర్ కాంటెక్స్ట్ లో ఈ గేమ్ ఉంటుంది. భూమి మీద మనిషి అనేవాడు అరుదుగా కనిపిస్తాడు. మన ఎర్త్ ని మరో గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్, పెద్ద పెద్ద మెషీన్స్ లీడ్ చేస్తుంటాయి. మెషీన్ కంట్రోల్డ్ గా ఉన్న ఎర్త్ ని మిగిలిన మనుషులు ఆధీనంలోకి తీసుకునేందుకు చేసే యుద్ధమే ఈ గేమ్.
   పెద్ద పెద్ద రోబోలతో, ఏలియన్స్ తో ఫైట్ అంటే పిల్లలకి భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. ఇదే గేమ్ ని ఏ కంప్యూటర్ మీదో, టీవీ మీదనో కాకుండా... ఇంట్లోనే ఓ బిగ్ స్ర్కీన్ పై ఆడితే ఎలా ఉంటుంది? అందుకోసం జస్ట్ ఈ పాకెట్ ప్రొజెక్టర్ ని వాడితే సరిపోతుందని మీకు తెలుసా? ఆ స్మార్ట్ టెక్నాలజీ ఏంటో చూద్దామా..
బ్రుక్ స్టోన్ హెచ్ డిఎమ్ఐ పాకెట్ ప్రొజెక్టర్..
   
ఇంటిని హోమ్ థియేటర్ గా మార్చేందుకు రకరకాల ప్రొజెక్టర్లను గూర్చి వినివుంటారు. కానీ ఇలాంటి పాకెట్ ప్రొజెక్టర్ గురించి మీరు ఎప్పడూ విని ఉండరు. బ్రుక్ స్టోన్ అనే కంపెనీ తయారు చేసిన ఈ హెచ్ డీ ఎంఐ పాకెట్ ప్రొజెక్టర్ ని మీరు స్కూల్ కు, ట్యుషన్ కి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ ప్రొజెక్టర్ 1080 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వీడియోలను డిస్ ప్లే చేస్తుంది. 60 ఇంచ్ డయాగోనల్ లో పెద్ద సైజులో పిక్చర్ ని చూడొచ్చు. హెచ్ డీ ఎంఐ పోర్టు ద్వారా దీన్ని స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్, కెమెరాలతో పాటు అన్ని రకాల వీడియో డివైజ్ లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లో ఆడుతున్న గేమ్ పోర్ట్ తో కనెక్ట్ చేస్తే బిగ్ స్ర్కీన్ మీద కనిపిస్తుంది. మెగా బ్రైట్ ల్యాంప్ ఉన్న ఈ ప్రొజెక్టర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు గంటల పాటు 85 లుమెన్స్ డిస్ ప్లేని ఇస్తుంది. ఈ ప్రొజెక్టర్ తో పాటు డ్యుయల్ స్పీకర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ మార్కెట్ లో దీని ధర 300 డాలర్స్.
మెడికల్ ఐస్ ఆన్..
   
ఇంజక్షన్ చేయాలంటే వెయన్ కోసం వెయిట్ చేయాల్సిన రోజులు పోయాయి. వెయిన్ దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి నుంచి రిలీఫ్ దొరికింది. ఈ గ్లాసెస్ పెట్టుకుంటే చాలు వెయిన్స్ , నెర్వ్స్ అన్నీ క్లియర్ గా కనిపిస్తాయి.
   మన స్కిన్ పై నుంచే ఈ నెర్వ్స్ ను చూడొచ్చు. ఎవెనా మెడికల్ అనే అమెరికన్ కంపెనీ దీన్ని డిజైన్ చేసింది.
   కంఫర్టబుల్ నోస్ రెస్ట్ తోపాటు నెక్ మీదకు హాంగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కనెక్టర్ తో పాటు బెల్ట్ మౌంటెడ్ పవర్ సప్లై ఫెసిలిటీ కూడా ఉంది. పైగా ఈ గ్లాసెస్ చాలా లైట్ వెయిట్. దీనిలో ఉన్న మల్టీ స్పెక్ట్రల్ లైటింగ్ తో ఎవ్రీ థింగ్ డీటెయిల్డ్ గా చూడొచ్చు. దీనిలో రెండు హైపర్ సెన్సిటివ్ కెమెరాలు ఉంటాయి. దీనికి బ్లూటూత్, వై-ఫై, 3జీ వైర్ లెస్ కనెక్టవిటీ కూడా ఉంటుంది. వీడియోలు, ఫోటోలు సేవ్ చేసుకోవడానికి ఇంటర్నల్ స్టోరేజ్ ఫెసిలిటీ, సౌండ్ కోసం టూ వే ఆడియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.
కాంపాక్ట్ స్పీకర్లు..
   
టీవీ, ల్యాపీలు, స్మార్ట్ మొబైల్స్.. వీటిలో పాటలు వినడానికి ఇన్ బిల్ట్ స్పీకర్లు ఉన్నా ఎక్స్ టర్నల్ స్పీకర్లతోనే సౌండ్ లో క్లారిటీ మ్యూజిక్ మస్తీలో షూరిటీ దొరుకుతుంది. అందుకే కాంపాక్ట్ స్పీకర్లకు డిమాండ్ పెరుగుతోంది. అవి ఎన్నో వెరైటీ డిజైన్లు, మరెన్నో ఫీచర్లతో మార్కెట్ లో కొస్తున్నాయి.
బోస్ సౌండ్ లింక్ మినీ..
   
అన్ని సంధర్బాల్లోనూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినలేం. అలాంటప్పుడు బోస్ సౌండ్ లింక్ మినీ (Bose sound link Mini) స్పీకర్ ని వాడొచ్చు. బాస్ అవుట్ పుట్ దీంట్లోని ప్రత్యేకత. మ్యూజిక్ ఫార్మేట్ ఏదైనా దీంట్లో ప్లే చేయొచ్చు. బ్లూటూత్ ద్వారా మొబైల్ , ల్యాపీ, ఎంపీ 3 ప్లేయర్లకు కనెక్ట్ అవుతుంది. స్పీకర్ పై భాగంలో కంట్రోల్ బటన్స్ ఉంటాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6.5 గంటల వరకు యూజ్ చేయొచ్చు. 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా పాటలు వినొచ్చు. డిఫరెంట్ కలర్స్ లో స్పీకర్లు దొరుకుతున్నాయి. ధర సుమారు 16,200 రూపాయలు.
జెబిఎల్ చార్జ్ (JBL charge)..
   
రెండు రకాలుగా ఉపయోగించుకునే స్పీకర్ జెబిఎల్ చార్జ్ (JBL charge) స్పీకర్. దీంతో పాటలు వినడం మాత్రమే కాదు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు యూఎస్ బీతో దీనికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఇది పవర్ బ్యాకప్ డివైజ్ గా కూడా యూజ్ అవుతుందన్నమాట. ల్యాపీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీంట్లో ఉండే 6000 ఎంహెచ్ఎ బ్యాటరీతో స్పీకర్ ను 10 గంటల పాటు వాడుకోవచ్చు. దీని ధర సుమారు 9,990 రూపాయలు.
కియేటివ్ ఎయిర్ వేవ్..
   
పోర్టబుల్ సైజ్ లో ఉంటే ఈ క్రియేటివ్ ఎయిర్ వేవ్ (Creative Airwaves) అనే గ్యాడ్జెట్ సాంగ్స్ ప్లే చేయడంతో పాటే మీ మొబైల్ కి వచ్చే వాయిస్ కాల్స్ ని కూడా వినిపిస్తుంది. ఇందుకోసం దీనిలో ఇన్ బిల్ట్ మైక్ ని ఫిక్స్ చేశారు. అంటే ఇది ఫోన్ కాల్స్ కు కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఫిట్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 10 నుంచి 10.5 గంటల పాటు ప్లే అవుతుంది. బ్లూటూత్ ద్వారా ఫోన్, ట్యాబ్, ల్యాపీలను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. దీని ధర సుమారు 6,999 రూపాయలు. .

No comments:

Post a Comment