ప్రస్తుతం ఉన్న మీ జీవన శైలిలో ఎటువంటి మార్పులు లేకుండా, బరువు తగ్గడం అంత
సులభం కాదు. అయినా, ప్రస్తుత యాంత్రిక యుగంలో మార్కెట్లో బరువుతగ్గించే
అనే వస్తువులు అందుబాటులో ఉన్నాయి . వాటిలో కొన్ని బాగానే పనిచేసిన, ఫలితం
మాత్రం అంతంత మాత్రమే, మరికొన్ని మాత్రం చాలా ప్రమాధకరమైనవి . అందుకు ఒకే
మార్గం, బరువుతగ్గాలనుకొనే వారు, వ్యాయామం తో పాటు, వారి రెగ్యులర్ డైట్ లో
మర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . ఇది మీ మెటబాలిజంను పెంచడంతో పాటు
మంచి ఫలితాలను అందిస్తాయి.
మీ మెటబాలిజం (జవక్రియలు)మరింత మెరుగ్గా పనిచేయాలంటే , మీ రెగ్యులర్ డైట్
లో కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను జోడించాలి . ఈ రోజు, ప్రియా కాత్ పాల్
-పోషకార నిపుణురాలు, ముంబాయ్, కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ఐటమ్స్ ఇక్కడ
మనకు తెలియజేసింది ఈ సింపుల్ ఫుడ్స్ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా
పనిచేస్తాయని తెలుపుతోంది.
1. ఫ్యాట్ రిలీజింగ్ ఫుడ్ 1: క్యాల్షియం :
మీరు వినే ఉంటారు క్యాల్షియం ఎముకలకు మరియు దంతాలకు చాలా బలాన్ని
అందిస్తాయని, అయితే ఇది, ఆకలిని కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని
వినడానికి చాలా ఆశ్చర్యపడి ఉంటారు. డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం మరియు
ఇతర క్యాల్షియం అధికంగా ఉండి, ఫ్యాట్ తక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం
వల్ల శరీరంలో ఆకలి కలగకుండా నియంత్రించవచ్చు. అదువల్ల కాల్షియం సమృద్ధిగా
ఉండే ఆహార ఉత్పత్తులను మరింత మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

No comments:
Post a Comment