Sunday, November 24, 2013

భూగోళం మీద ఒకప్పుడు మంచుయుగం

భూగోళం మీద ఒకప్పుడు మంచుయుగం ఉండేందని తెలుస్తోంది. భవిష్యత్తులో మంచుయుగం ముంచుకొస్తోంది. ప్రపంచాన్ని మొత్తం మంచు దుప్పటి కప్పేయనుంది. భూగోళమే ఓ మంచు ముద్దగా మారిపోనుంది. చెట్లు,
చేమలు, కొండలు అన్నీ మంచు మయమయం కానున్నాయి. భూతాపం తగ్గి అతి శీతలం ఈ ప్రపంచాన్ని ఫ్రీజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. చల్లదనం కోసం వెతికే ప్రాణులన్నీ ఇక వెచ్చదనం కోసం వేచి చూస్తాయి. భూమి మీద జీవుల మనుగుడ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనుంది. ఒకవేళ నిజంగానే ఐస్ ఏజ్ ప్రపంచాన్ని ఆవరిస్తే భమిపై పచ్చిక బయళ్లు ఇక కనిపించవు, కొండకోనలు మంచుమయం అవుతాయి. రంగు రంగుల సీతాకోక చిలుకల నుంచి భారీ గజరాజుల వరకు గజగజా వణికిపోనున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. దీంతో మంచు ముప్పు ముంచుకొస్తోందా? మరో హిమ యుగం అప్పుడే ఆరంభమైందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఇక ఈ భూగోళం అంతా మంచు ముద్దగా మారిపోనుంది. ఎటు చూసినా హిమగిరులే కనిపిస్తాయి. సాధారణ మైదాన ప్రాంతం సైతం ఇలా మొత్తం మంచుతో నిండిపోతుంది. ప్రపంచమంతా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. దాన్ని ఊహించుకుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
ఐస్ ఏజ్ ఎలా ఏర్పడుతుంది?
  
ఐస్ ఏజ్ ఇప్పుడు ఓ పెద్ద పజిల్ గా మారిపోయింది. గ్లోబల్ వార్మింగ్, భూ కక్ష్యలో మార్పులు, ఊహించని సునామీలు, భయానక తుఫాన్లే దానికి ముందస్తు హెచ్చరికలా? అకాల వరదలు, ప్రకృతి విలయాలే ఆ ప్రమాదానికి సూచికలా?
  వంటి తలెత్తున్న సమస్యలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధాన చెబుతున్నారు. అయితే కొంత మంది శాస్త్రవేత్తలు ఐస్ ఏజ్ రాదని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే మంచు భూగోళాన్ని కబలించేస్తుందనే వారు దాన్ని నిరూపించే పనిలో తలమునకలై ఉన్నారు.
ఐస్ ఏజ్ ఏర్పడితే అసలేం జరుగుతుంది?
   
భూగోళం మంచుమయంగా మారుతుంది. భూమ్మీద నివసిస్తున్న సకల జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
   అసలు శీతల వాతావరణంలో మనిషి ఆ చలిని తట్టుకోగలడా అనేది సందేహాత్మకంగా మారింది. వాతావరణ పరిస్థితులు పూర్తిగా తలకిందులైపోతాయి. రక్తం గడ్డ కట్టుకుపోయే చలిలో వెచ్చదనం కోసం జీవులు అల్లాడిపోతాయి. సూర్యరశ్మి నేల మీద పడక జీవ ప్రక్రియలు నిలిచిపోతాయి. జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. మంచు పొరల్లో గడ్డ కట్టుకు పోయి జీవజాలం చరిత్రలో కేవలం ఆనవాళ్లుగా మిగిలిపోతాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో మంచు యుగం ఏర్పడ్డం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం సృష్టిస్తున్న ఐస్ ఏజ్ ప్రకంపనాల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేమని కొందరు వాదిస్తున్నారు. మొత్తం భూగోళం మీద ఉన్న జీవజాతుల తలరాతనే మార్చేసేంతటి శక్తివంతమైన మంచు యుగాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
   ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న ఐస్ ఏజ్ ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు భూమి లోపల అట్టడుగు పొరల్ని తవ్వి ఆ నిజాల్ని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
   నేలపై ఒకప్పుడు మంచు యుగం నడిచిందనడానికి ఆనవాళ్లు ఎక్కడైన ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు భూమి పొరల్లో దాగున్న వేల లక్షల సంవత్సరాల నాటి రహస్యాల్ని తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
   ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న ఐస్ ఏజ్ ప్రకంపనాల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేమని కొందరు సైంటిస్టులు వాదిస్తున్నారు. మొత్తం భూగోళం మీద ఉన్న జీవజాతుల తలరాతనే మార్చేసేంతటి శక్తివంతమైన మంచు యుగాన్ని తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు..
   భూమి లోపల అట్టడుగు పొరల్ని తవ్వి ఆ నిజాల్ని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర వ్యవస్థలో భూమి గమనాన్నిలెక్కిస్తున్నారు. ఈ రెండు పరిశోధనలు చెబుతున్న నిజం ఒకే విధంగా ఉంది. లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? అన్న ఆసక్తిర విషయాలను పరిశోధనలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
   భూగోళం మొత్తం మంచు ముద్దగా మారిపోతుంది. గ్లోబల్ ఐస్ ఏజ్ మళ్లీ మొదలవుతుంది.
   కాలిఫోర్నియా లోని లబ్రియా టార్ ఫిట్స్ లో శాస్త్రవేత్తలకు మంచు ఏనుగుల జాడ దొరికింది. అంటే కాలిఫోర్నియా ఒకప్పుడు మంచుతో కప్పబడిన ప్రాంతామా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. భూమి పొరల్లో దాగున్న వేల లక్షల సంవత్సరాల రహస్యాల్ని తవ్వేందుకు ప్రయత్నించారు.
   పదివేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో మంచు యుగం నడిచేది అనడానికి కొన్ని ఆనవాళ్లు, ఆధారాలు దొరికాయి. కానీ భూగోళం ఎలా గడ్డ కట్టుకుపోయింది.. అంత భారీ మంచు ఎలా సాధ్యమైంది.. ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఆ భూమి పొరల్లో దొరకలేదు. అయితే దీనికి సమాధానం భూ ఉపరితలం మీదే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై మార్పుకు కారణం..
   
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఇదీ క్రమ క్రమంగా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడితో భూమికున్న సంబంధం కూడా మారుతుంది. ఈ మార్పు కారణంగానే భూమ్మీద వాతావరణం వేడిమి నుంచి మంచు యుగానికి, మంచు యుగం నుంచి వేడిమికి మారుతూ ఉంటుంది. ఇలా మారుతున్నప్పుడు కాలాన్ని లెక్క కడితే భూమ్మీద దాదాపు 90 వేల సంవత్సరాల పాటు మంచు యుగమే రాజ్యమేలుతుంది. ఆ తర్వాత భూమి కక్ష్యలో మార్పు సంభవిస్తుంది. దీంతో మళ్లీ సూర్యుని వేడికి మంచు కరగడం మొదలవుతుంది. తిరిగి మళ్లీ జీవరాశుల ఆవిర్భావం జరుగుతుంది. దాదాపు 10 వేల సంవత్సరాలపాటు జీవ జాతులతో భూగోళం కళకళలాడుతుంది. ఆ తర్వాత భూమి కక్ష్యలో మార్పు రావడంతో మళ్లీ మంచు యుగం ఆవిర్భవిస్తుంది. ఈ చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. భూ కక్ష్య మారడానికి సంబంధించిన లెక్కలు గతంలో మంచు యుగం ఏర్పడిందని చెబుతున్న కాలానికి సంబంధించిన లెక్కలు సరి చూస్తే మనం మళ్లీ మంచుయుగం ఆరంభంలో ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే కాలచక్రం తిరిగి తిరిగి మరో మంచు యుగానికి స్వాగతం పలుకుతోందని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు తవ్వి తీసిన మట్టి నమూనాలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయి. 10 వేల సంవత్సరాల క్రితం భూమ్మీద మంచు యుగం నడిచింది అని చెప్పడానికి ఈ మట్టి సాక్ష్యంగా నిలుస్తోంది. అంటే మనం మరో మంచు యుగం ఆరంభంలో ఉన్నామన్నమాట.
   భూగోళంపై ఒకప్పుడు మంచు యుగం అంతమైపోయింది. భూమిపై జీవరాశి పుట్టింది. అవి విపరీతంగా పెరిగిపోయాయి. వాటి అవసరాలు పెరిగిపోయాయి. అభివృద్ధి ఆరంభమైంది. దానికి విధ్వంసం తోడైంది. వాతావరణంలో మళ్లీ మార్పులు మొదలయ్యాయి. ఆ మార్పులు ఇప్పుడు ప్రమాదంగా మారాయి. భూమి అగ్నిగోళంగా మారిపోయింది. ఒక పక్క హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మరో పక్క మంచు ముప్పు ముంచుకొస్తోంది. భిన్న ఉపద్రవాలకు గ్లోబల్ వార్మింగే కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
   భూమి మంచు ముద్దగా మారిపోయిన నాటి పరిస్థితులపై జోరుగా అధ్యయనాలు సాగుతున్నాయి. మంచు యుగం ఏ పరిస్థితుల్లో అంతరించి పోయిందోనన్న అంశాలపై కూడా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో మళ్లీ మంచు ముప్పు ముంచుకొస్తుందనే సంకేతాలూ అందుతున్నాయి. ఏ వాతావరణం అయితే ఐస్ ఏజ్ ఏర్పడ్డానికి కారణం అయ్యిందో అదే అంతరించిపోవడానికీ కారణమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గ్లోబల్ వార్మింగే ఐస్ ఏజ్ కి కారణమా..?
   
గ్లోబల్ వార్మింగే ఐస్ ఏజ్ కి కారణమని కొంతమంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఒకవైపు మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందోళన కలిగిస్తోంది. మరో వైపు అదే గ్లోబల్ వార్మింగ్ మరో సారి మానవాళి మంచు ముప్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని హెచ్చరిస్తోంది. కాలుష్యం కారణంగా గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగిపోతోంది. దీని ద్వారా గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో కలిసిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన స్థాయిలో పెరిగిపోతున్నాయి. భూతాపం పెరిగిపోవడమే వాతావరణం మార్పులకు కారణమని భూ భౌతిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయువులు, సల్ఫర్ డై ఆక్సైడ్లతో మంచు ముప్పు ముంచుకొస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ వాయువులు గాలిలో మందంగా పేరుకుపోయి భూమ్మీదకు వచ్చే సౌరశక్తిని అడ్డుకుంటాయి. దీంతో భూ ఉష్ణోగ్రత తగ్గి శీతల వాతావరణం ఏర్పడుతుంది. ఈ అతి శీతల వాతావరణమే మంచు యుగానికి దారి తీస్తుందని చెబుతున్నారు.
మంచుయుగం ముంచుకొస్తే...
   
ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో మంచుయుగం ఏర్పడటం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద మంచుయుగం ఏర్పడితే ఏం జరుగుతుంది? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మనిషి ఇంత వరకూ ఎదుర్కోని పరిస్థితులకు ఎలా స్పందిస్తాడు? మంచు యుగం రాకుండా ఆపడం సాధ్యం కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భూగోళంపై ఒకప్పుడు మంచు రాజ్యమేలింది. అదే ఐస్ ఏజ్. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత అదే ఐస్ ఏజ్ ఇప్పుడు మళ్లీ ఏర్పడనుంది.
ఐస్ ఏజ్ ఏర్పడితే..
   
ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో మంచు యుగం ఏర్పడటం ఖాయమని శాస్త్రవేత్తలు చెబతున్నారు. భూమ్మీద మంచు యుగం ఏర్పడితే వెంటనే ఏం జరుగుతుందన్న విషయం మీద అమెరికా అప్పుడే పరిశోధనలు కూడా మొదలుపెట్టింది. గతంలో భూమ్మీద మంచు యుగం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో భూగోళం మొత్తం కలిపినా జనాభా 50 లక్షలకు మించిలేదు. ఇప్పుడు ఆ సంఖ్య ఏడు వందల కోట్లకు పైగా ఉంది. మరి వీరందర్నీ కాపాడడం సాధ్యమేనా? భూమ్మీద మూడు కిలోమీటర్ల మేర మంచు పేరుకుపోతుంది. లండన్, న్యూయార్క్ నగరాలు వేల మీటర్ల ఐస్ కింద కూరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జన జీవనం ఎలా ఉంటుంది. ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు మంచు పలకలు విస్తరిస్తాయి. మంచి నీళ్లు మొత్తం గడ్డ కట్టుకుపోతాయి. చెట్లూ చేమలు అన్నీ ఘనీభవిస్తాయి. పరిశ్రమలు మూతబడిపోతాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కూడా పనిచేయవు. మనిషి ఇంత వరకూ అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోని ఉండడు. వీటిని తట్టుకోవడం అంత తేలికేం కాదు. మంచు యుగం రాకుండా ఆపడం సాధ్యమయ్యే పని కాదు. మంచు యుగం అంటూ ఏర్పడితే ఆ పరిస్థితుల్లో భూమ్మీద బతకడం కంటే అంగారక గ్రహం మీద బతకడమే సులభమని శాస్త్రవేత్తలు తేల్చేస్తున్నారు.
   మొక్కలు, వృక్షాలు అన్నీ గడ్డ కట్టుకుపోతే మనిషికి తిండి దొరకడం కూడా కష్టమై పోతుంది. ఆ చలిని తట్టకునేందుకు జీవజాతుల్లో కొన్ని మార్పులు కూడా జరుగుతాయని చెబుతున్నారు.
   మంచు ప్రతాపం బాగా తీవ్రమై అసలు వేడి జాడే తెలియకపోయే పరిస్థితులు ఏర్పడితే క్రమక్రమంగా జీవ జాతులు అంతరించిపోతాయి. ఆ మంచు పొరల్లో వాటి ఆనవాళ్లు మాత్రమే నిక్షిప్తమై పోతాయి.
   అయితే ఐస్ ఏజ్ మొదటిదీ కాదు చివరిదీ కాదు భూమి మీద జీవజాతి ఏర్పడటం మంచుయుగం కారణంగా అది తుడిచిపెట్టుకుపోవడం అనేది ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూనే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
   ప్రకృతి వింతలు ఇంకా మనిషికి పూర్తిగా అర్థం కాలేదు. ఎప్పుడు ఏ రూపంలో విరుచుకు పడుతుందో ఊహించడం కూడా కష్టమే. మంచుయుగం ముప్పు ముంచుకొస్తోందనే విషయం కాలగమనంలో వచ్చే మార్పేనని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణం అని ఇంకొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరి వాదం ఎలా ఉన్నా మనిషి మాత్రం ఓ పెను ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలేమో అనిపించకమానదు.

No comments:

Post a Comment