ప్రస్తుత రోజుల్లో కిడ్నీ స్టోన్ (మూత్రపిండాల్లో రాళ్ళు)ఏర్పడటం అనేది చాలా సాధారణ అరోగ్యం సమస్యగా భావిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళు కొన్ని రసాయనాల
వల్ల ఉత్పన్నం అవుతాయిన నిపుణులు చెబుతున్నారు. ఆ రసాయనాలు అంటే యూరిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు ఆక్సాలిక్ యాసిడ్ వంటివి యూరిన్ లో కనుగొన్నప్పుడు ఇలా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతాయని కనుగొన్నారు. కిడ్నీ స్టోన్ కు మరో సాధారణ కారణం, అత్యధికంగా విటమిన్ డి, పోషకాల లేమితో బాధపడే వారిలో, డీహైడ్రేషన్, గౌట్ పెయిన్ మరియు సరైన సమయంకు ఆహారం తీసుకోని వారిలో ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణుల చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయనడానికి మరో ప్రధాన లక్షణం తరచూ మూత్ర విసర్జన మరియు నొప్పితో కూడిన యూరినేషన్, అలసట, వాంతులు, మరియు అధిక చెమట ఇవన్నీ కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయని తెలిపే లక్షణాలు. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్ళ సైజును బట్టి, కడుపు ఉదరభాగంలో (ఆబ్డామినల్)నొప్పి తీవ్రంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల భరించలేనంత నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, మూలికా చికిత్స చాలా అవసరం. అలోపతి కాకుండా, నేచురల్ గా లభించే మూలికలతోనే చాలా కేసులు సక్సెస్ ఫుల్ గా చికిత్స అందించగలుగుతున్నారు. సహజ సిద్దంగా లభించే ఈ మూలికలు చాలా సులభంగా మనకు దొరుకుతాయి. వీటిని కిడ్నీ స్టోన్ చికిత్సకోసం ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మూలికల చికిత్సతో మూత్రపిండాల్లో చాలా త్వరగా రాళ్ళు కరిగించవచ్చు అని చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి మరియు కిడ్నీస్టోన్స్ కరిగించడానికి సహాయపడే కొన్ని మూలికలు క్రింది స్లైడ్ లో ఉన్నవి, వాటిని పరిశీలించండి.
తులసి: తులసి వల్ల మూత్రపిండాలకు ఒక పటిష్టమైన ప్రభావం కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నట్లైతే ఒక టీస్పూన్ తులసి రసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ మూలిక వైద్యం వల్ల రెగ్యులర్ గా ఆరునెలలపాటు క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల కిడ్నీలోని రాళ్ళునివారించిబడుతాయి. మరియు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోయేందుకు సహాయపడుతుంది.
No comments:
Post a Comment